కరోనా మహమ్మారి తర్వాత ఇప్పుడు మరో వ్యాధి యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వ్యాధి కూడా చైనా నుంచే పుట్టింది. చైనాలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న లియోనింగ్ ప్రావిన్స్‌లోని పిల్లల్లో న్యుమోనియా ముప్పు అధికమవుతుంది. పిల్లలలో ఊపిరితిత్తులలో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు లక్షణాలు కనిపిస్తూ.. వేగంగా పెరుగుతుంది. అయితే.. చైనాలో వ్యాప్తి చెందుతున్న న్యుమోనియాపై ఎయిమ్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. దీనికి చైనానే పూర్తి బాధ్యత వహించాలని ఎయిమ్స్ పేర్కొంది.
MallaReddy: మహేష్ బాబు బిజినెస్ మేన్ చూసి.. రాజకీయాల్లోకి వచ్చా..
చైనాలో పిల్లల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న న్యుమోనియాపై.. ఎయిమ్స్ మదర్ అండ్ చైల్డ్ బ్లాక్ HOD డాక్టర్ SK కబ్రా మాట్లాడుతూ.. శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాతో బాధపడుతున్న పిల్లల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసులను పరిశీలిస్తే వాతావరణం ప్రభావం ఉందని అన్నారు. ఇన్ఫ్లుఎంజా, మైకోప్లాస్మా న్యుమోనియా, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV), SARS-CoV-2 చైనాలో శ్వాసకోశ వ్యాధుల సంభవం పెరుగుదలకు కారణం అని చెప్పవచ్చు. కాగా.. ఇప్పటివరకు ఈ వ్యాధికి సంబంధించి ఏ వైరస్ కనుగొనలేదు. మైకోప్లాస్మా న్యుమోనియాకు కారణమని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. మైకోప్లాస్మా న్యుమోనియా అనేది సాధారణంగా చిన్న పిల్లలను ప్రభావితం చేసే ఒక సాధారణ బాక్టీరియా సంక్రమణం అని తెలిపింది.
Chelluboina Venugopal: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌కు అస్వస్థత
చైనాలోని పిల్లల్లో ఈ కేసులు పెరుగుతున్నాయని.. ఇంకా ఎక్కువయ్యే అవకాశముందని SK కబ్రా అన్నారు. చైనాలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు దీనికి కారణం అని చెప్పవచ్చు. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్‌లోనే చైనా లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. అప్పటినుంచి.. మొదటి శీతాకాలంలో ప్రజలు తిరగడం మొదలుపెట్టారని.. దీంతో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని కబ్రా తెలిపారు. ఎక్కువగా ఐదేళ్లలోపు పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి లేనందున సంక్రమణ వేగంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు.