తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్ కంటే ముందే తాను చెప్పానని.. వచ్చేది కాంగ్రెస్ అని తెలిపారు. దారిన పోయే వాళ్లలో అందరిని అడగండి.. ఎవరు సీఎం అని అంటే వాళ్ళను సీఎం చేయండని అన్నారు. డిసెంబర్ 3 నుండి పండగ ప్రారంభమవుతుందని బండ్ల గణేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో.. 76 నుండి 86 వరకు సీట్లు వస్తాయని తెలిపారు.
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఏపీ బీసీ సంఘం ఈ నెల 13, 14 తేదీలలో ఛలో ఢిల్లీ కార్యక్రమంతో పాటు జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టనుంది. హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం ఈనెల 13, 14వ తేదీల్లో నిర్వహిస్తున్నామని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ మారేష్ పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్‌లోని గుణ రైల్వే స్టేషన్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వే పట్టాలపై వచ్చి పడుకున్నాడు కానీ.. అదృష్టవశాత్తూ రైలు అతనిపై నుండి వెళ్ళిన బతికి బట్ట కట్టాడు. ఆ వృద్ధుడికి ఒక్క చిన్న గాయం కూడా రాలేదు. ఈ ఘటన గురువారం గుణ రైల్వే స్టేషన్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 70 ఏళ్ల వృద్ధుడు రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. ఇంతలో గూడ్స్ రైలు ఆ పట్టాల మీద నుండి…
బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ తమ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ముమ్మాటికీ 70 సీట్లకు పైగా బీఆర్ఎస్ గెలుస్తుందని దాసోజు శ్రవణ్ అన్నారు. మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. తెలంగాణ ప్రజలతో కేసీఆర్ ది పేగు బంధం అని పేర్కొ్న్నారు. ఎగ్జిట్ పోల్ కు ఎగ్జాక్ట్ పోల్స్ కు మధ్య చాలా తేడా ఉంటుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నాడని చెప్పారు. కాంగ్రెస్ నేతలు లేకి తనం చూపిస్తున్నారు.. చిల్లర…
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లపై సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఫైర్ అయ్యారు. నువ్వెంత.. నీ బతుకెంత లోకేష్ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రిపై దూషణలా.. అచ్చోసిన ఆంబోతులా మాట్లాడితే బుద్ధి చెబుతామన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో అగ్రనేత రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 కి జూమ్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. రేపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలవడనున్న నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధన్యత సంతరించుకుంది.
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై మరోసారి కేంద్ర జల శక్తి శాఖ సమావేశం నిర్వహించనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర అధికారులతో కేంద్ర జల సమావేశాన్ని కేంద్ర జల శక్తి శాఖ చేపట్టనుంది.
హైదరాబాద్‌లో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను టీ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 మి.లీ లిక్విడ్ మెథాంఫెటమైన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. టీఎస్ న్యాబ్ ఎస్పీ గుమ్మి చక్రవర్తి ప్రెస్ మీట్ నిర్వహించారు. సూరారంలో డ్రగ్స్ తయారీ ముఠాను పట్టుకున్నామని అన్నారు. సూరారం పోలీసులతో పాటు టీఎస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారని పేర్కొన్నారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు వచ్చారు. అయితే, ఢిల్లీలో పొగ మంచు కారణంగా విమానాల దారి మళ్లింపుతో తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కాలేకపోయారు.