ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడి ఘటనలో 42 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేద, గిరిజన ప్రజల్ని క్రైస్తవ మతంలోకి మార్పిడి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
సీఆర్పీఎఫ్ జవాన్లు టార్గెట్ గా ఉదయం ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ 195 బెటాలియన్‌కు చెందిన ఇద్దరు జవాన్లకు, అలానే ఒక మీడియా వ్యక్తికి గాయాలయ్యాయి.
డిసెంబర్ 4 నుంచి 22వ తేదీ వరకు భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. 19 రోజుల్లో 15 సిట్టింగుల్లో పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగనుంది.
చైనాలో మరో వైరల్ వేగంగా వ్యాపిస్తోంది. దీని కారణంగా చాలా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు అమెరికా, చైనాల మధ్య ప్రయాణ నిషేధం విధించాలని అమెరికా సెనేటర్లు అధ్యక్షుడు జో బైడెన్‌ను డిమాండ్ చేశారు.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య గత కొంత కాలంగా యుద్ధం కొనసాగుతుంది. అయితే, అక్టోబర్ 24న ఈ రెండు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో వారం రోజుల పాటు ఎలాంటి దాడులు జరగలేదు.
5 టీ20 సిరీస్ లో భాగంగా టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. నాలుగో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 20 పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.
ఓ ఎలుక ఒక బొమ్మ స్కూటర్‌పై విన్యాసాలు చేస్తూ ఆనందంగా తిరుగుతూ ఉండటం కనిపిస్తుంది. అది చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో.. బొమ్మ స్కూటర్‌పై ఒక చిన్న ఎలుక ఆనందంగా విన్యాసాలు చేస్తూ కనిపిస్తుండటం మీరు చూడవచ్చు.