తన పైన తరుచూ లైగిక దాడికి పాల్పడుతున్నాడని ఓ విదేశీ మహిళ ఓ డీజే పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ముంబై లో చోటు చేసుకుంది. వివారాలోకి వెళ్తే.. మెక్సికోకి చెందిన ఓ మహిళకు (31) 2017లో సోషల్ మీడియా ద్వారా” స్లిక్ ఎంటర్‌టైన్‌మెంట్” వ్యవస్థాపకుడు అలానే డైరెక్టర్ అయినటువంటి పాండేతో పరిచయం అయ్యింది. ఈ నేపథ్యంలో మోడల్ కావాలనే ఉద్దెశంతో మెక్సికో నుండి ఇండియాకి వచ్చింది మహిళ. కాగా పాండే 2019 జూలైలో బాంద్రా లోని తన ఇంటిలో మొదటిసారిగా ఆమె పైన లైగిక దాడికి పాల్పడ్డాడని.. తరువాత పదేపదే తన పైన లైగిక దాడికి పాల్పడుతున్నట్లు తెలిపింది.
Read also:Chandrababu Districts Tour: మళ్లీ జనంలోకి చంద్రబాబు.. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటన..
కాగా అతనికి 2020 లో మరో మహిళతో వివాహం జరిగిందని.. అయిన తనకు అసభ్యకర సందేశాలను పంపిస్తూ.. లైగికంగా వేధిస్తున్నాడని.. అతను చెప్పిన దానికి నిరాకరిస్తే అసైన్‌మెంట్ నుంచి గెంటేస్తానని బెదిరించి నిందితుడు తనపై బలవంతం చేశాడని.. అలానే అతను తన కొన్ని సన్నిహిత చిత్రాల ద్వారా ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. కాగా ప్రస్తుతం తాను వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నానని తెలిపింది.. ఈ నేపథ్యంలో అతను ఆమెను చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బాంద్రా పోలీసులు నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు.