Dasoju Sravan: తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలవడనున్నాయి. అందుకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ మూడోసారి గెలిచి అధికారంలోకి రావాలని చూస్తుండగా.. కాంగ్రెస్ గెలిచి తొలిసారిగా అధికారాన్ని పొందాలని చూస్తోంది. ఈ క్రమంలో రాజకీయ నాయకులు.. తమ పార్టీ గెలుస్తదంటే, తమ పార్టీ గెలుస్తదని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ తమ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
Read Also: MLA TJR Sudhakar Babu: నువ్వెంత.. నీ బతుకెంత?.. లోకేష్‌పై ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్
ముమ్మాటికీ 70 సీట్లకు పైగా బీఆర్ఎస్ గెలుస్తుందని దాసోజు శ్రవణ్ అన్నారు. మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. తెలంగాణ ప్రజలతో కేసీఆర్ ది పేగు బంధం అని పేర్కొ్న్నారు. ఎగ్జిట్ పోల్ కు ఎగ్జాక్ట్ పోల్స్ కు మధ్య చాలా తేడా ఉంటుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నాడని చెప్పారు. కాంగ్రెస్ నేతలు లేకి తనం చూపిస్తున్నారు.. చిల్లర ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారం లేకుండానే ఇంత లేకి తనం చూపిస్తున్నారని మండిపడ్డారు. సంప్రదాయాలు తెలియకుండా క్యాబినెట్ మీటింగ్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇదిలా ఉంటే.. కర్ణాటక నేతలకు తెలంగాణలో ఏం పని? అని ప్రశ్నించారు. కర్ణాటక నేతలు గద్దల్లాగా వచ్చి పడుతున్నారని విమర్శించారు.
Read Also: Khalistan: భారత సంతతి వ్యక్తి హత్యకు ఖలిస్తాన్ తీవ్రవాదుల కుట్ర.. ముగ్గురికి శిక్ష విధింపు..