MLA TJR Sudhakar Babu: నువ్వెంత.. నీ బతుకెంత?.. లోకేష్‌పై ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA TJR Sudhakar Babu: టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లపై సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఫైర్ అయ్యారు. నువ్వెంత.. నీ బతుకెంత లోకేష్ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రిపై దూషణలా.. అచ్చోసిన ఆంబోతులా మాట్లాడితే బుద్ధి చెబుతామన్నారు. సీఎంను తిట్టి నాయకుడివి అవ్వాలనుకుంటున్నావా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. వెన్నుపోటు వీరుడు-స్కిల్ దొంగ చంద్రబాబే కదా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు అని ఎన్నిసార్లు ప్రశ్నించినా లోకేష్ నుంచి సమాధానం లేదన్నారు. లోకేష్ మోకాళ్ళ యాత్ర చేసినా, పొర్లుదండాల యాత్ర చేసినా, పాక్కునే, దాక్కునే యాత్ర చేసిన ఫలితం ఏమీ ఉండదన్నారు. ముఖ్యమంత్రిపై లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Read Also: Krishna River: నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై మరోసారి కేంద్ర జల శక్తి శాఖ సమావేశం
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
జగన్‌ను ఎందుకు ఓడించాలో పవన్ పది కారణాలు చెప్పాలన్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తున్నందుకా?.. రైతు భరోసా ఇస్తున్నందుకా? అమ్మ ఒడి, చేయూత, ఆసరా.. ఇస్తున్నందుకా?.. ప్రజల్ని ఆదుకుంటున్నందుకా?.. గిట్టుబాటు ధరలు, బిడ్డలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నందుకా?.. ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు. నువ్వు చేసే న్యాయం సినిమా ఇండస్ట్రీలో చెయ్ అంటూ ఎమ్మెల్యే సుధాకర్ బాబు పేర్కొన్నారు. మీ కుటుంబం అంతా సినీ ఇండస్ట్రీలో ఉన్నారుగా.. అక్కడ ఉన్న కార్మికుల్ని ఆదుకోవాలని సూచించారు. అన్ని కులాల వారిని రానివ్వండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!