Drugs Seize: హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా అరెస్ట్.. నిందితుల నుంచి డ్రగ్స్ స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను టీ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 మి.లీ లిక్విడ్ మెథాంఫెటమైన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. టీఎస్ న్యాబ్ ఎస్పీ గుమ్మి చక్రవర్తి ప్రెస్ మీట్ నిర్వహించారు. సూరారంలో డ్రగ్స్ తయారీ ముఠాను పట్టుకున్నామని అన్నారు. సూరారం పోలీసులతో పాటు టీఎస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారని పేర్కొన్నారు. అంతేకాకుండా.. డ్రగ్స్ తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుండి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 ఎంఎల్ లిక్విడ్ మెథాంఫెటమైన్ స్వాధీనం చేసుకునట్లు పేర్కొన్నారు.
Read Also: Pawan Kalyan: ఆ రెండు భావజాలాలు నాకు ఇష్టం.. ఒక తాటిపైకి తేవాలన్నదే నా ఉద్దేశం
Also Read
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
- India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
పట్టుబడ్డ డ్రగ్స్ విలువ సుమారు 50 లక్షల రూపాయల విలువ ఉంటుందని ఎస్పీ తెలిపారు. డ్రగ్స్ తయారీలో ప్రధాన నిందితుడు కమ్మ శ్రీనివాస్ గా గుర్తించామని.. అతను ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గాజుల రామారంలో ఉంటాడని పేర్కొన్నారు. మణికంఠ స్వస్థలం.. కాకినాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి అతనికి చేపల చెరువులు ఉన్నట్లు తెలిపారు. కమ్మ శ్రీనివాస్ 2013లో ఓ పరిశ్రమలో ఇదే డ్రగ్స్ తయారీ చేసాడని.. ఆ సమయంలో NCB వాళ్ళు పట్టుకుని జైలుకు పంపారు.. నాలుగు సంవత్సరాలు తర్వాత బయటికి వచ్చాడని ఎస్పీ పేర్కొన్నారు. జైలు నుండి బయటికి వచ్చాక నరసింహ రాజు మణికంఠతో కలిపి డ్రగ్స్ తయారు చేయడం మొదలుపెట్టాడని తెలిపారు.
Read Also: Game changer : శంకర్ కు డెడ్ లైన్ పెట్టిన రాంచరణ్..?
సూరారంలో ఒక ఇంట్లో మెథాంఫెటమైన్ డ్రగ్స్ తయారీ మొదలు పెట్టారని ఎస్పీ గుమ్మి చక్రవర్తి చెప్పారు. నిందితుడు కమ్మ శ్రీనివాస్‌కు డ్రగ్స్ తయారీపై అవగాహన ఉంది… ఈ ముగ్గురు సంయుక్తంగా గత రెండు సంవత్సరాలుగా డ్రగ్స్ తయారుచేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని తెలిపారు. లిక్విడ్ మెథాంఫెటమైన్ ప్రాసెస్ చేసి డ్రై చేస్తే క్రిస్టల్ మెథాంఫెటమైన్ డ్రగ్ తయారవుతుంది. తయారుచేసిన డ్రగ్స్ వివిధ ప్రాంతాల్లో విక్రయించారు… సోషల్ మీడియా ద్వారా విక్రయాలు కొనసాగించారని న్యాబ్ ఎస్పీ తెలిపారు. మెథాంఫెటమైన్ డ్రగ్ అనేది రిలాక్స్ మూడ్ లోకి తీసుకెళ్తుందని వినియోగిస్తారు ఎస్పీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు నిందితుల పై పీడియాక్ట్ ప్రపోజ్ చేస్తామని టీఎస్ న్యాబ్ ఎస్పీ గుమ్మి చక్రవర్తి తెలిపారు.
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!