Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు ఘాతుకం.. మందుపాతర పేలుడు, ఇద్దరు జవాన్లకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు మావోలు దుశ్చర్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత దంతెవాడ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. అయితే పోలీసులే లక్ష్యంగా ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల ఫలితాలకు ముందు ఈ ఘటన జరగడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి విధ్వంసకర సంఘటనలు జరగకుండా.. చర్యలు తీసుకుంటున్నారు.
Read Also: Russia-Ukraine War: ప్రమాదం అంచున జపొరిజ్జియా అణు కర్మాగారం..
Also Read
- Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
- Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
- Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
- Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
వివరాల్లోకి వెళ్తే.. నక్సలైట్లు పీఎల్‌జీఏ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం సందర్భంగా పలు చోట్ల బ్యానర్లు, పోస్టర్లు అంటించారు. వాటిని తొలగించేందుకు 195 బెటాలియన్ పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో బార్సుర్‌పల్లి సమీపంలో పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందుపాతరను మావోయిస్టులు పేల్చారు. దీంతో తీవ్ర గాయాలైన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనలో ఓ జర్నలిస్ట్ కు కూడా గాయాలయ్యాయి. అయితే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Dil Raju :‘యానిమల్’ లాంటి సినిమా చెప్పి మరీ తీస్తా !
కాగా.. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌తో సహా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డిసెంబరు 2 నుంచి డిసెంబర్ 8 వరకు నక్సలైట్లు పీఎల్‌జీఏ వారోత్సవాల 23వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నక్సలైట్లు ప్రతి సంవత్సరం డిసెంబర్ 2 నుండి 8 వరకు ఈ వారొత్సవాన్ని జరుపుకుంటారు. నక్సలైట్లు గెరిల్లా యుద్ధం కోసం 2000 సంవత్సరంలో PLGAని స్థాపించారు. ఈ సందర్భంగా నక్సలైట్లు ప్రతి సంవత్సరం పీఎల్‌జీఏ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటారు.
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!