Health Tips: చలికాలంలో రోజూ లవంగం, ఏలకులు తింటే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్లో దగ్గు, జలుబు, జ్వరాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో వాటిని నివారించడానికి మీరు వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాలతో దూరం చేయవచ్చు. అవి లవంగం, యాలకులు.. వీటిని పోషకాల నిధిగా పరిగణించుతారు. లవంగాలలో మాంగనీస్, విటమిన్ కె, పొటాషియం, బీటా కెరోటిన్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. యాలకుల్లో కూడా.. మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, విటమిన్ B-6, ప్రోటీన్, ఫైబర్, రైబోఫ్లావిన్, నియాసిన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు లభిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…..
Attack On Couple: దంపతులపై దుండగుల దాడి.. సాయం అడిగి చితకబాదారు
Also Read
- CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
- Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
- Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
- Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
రోజూ లవంగాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
లవంగాలు ఆహార రుచిని పెంచడంతో పాటు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా.. శరీరంలో ఉండే బాక్టీరియాను చంపడానికి, ఇన్ఫెక్షన్తో పోరాడటానికి, శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. అంతే కాకుండా వీటిలో ఉండే విటమిన్ సి, జింక్.. అనేక అంటు వ్యాధులతో పోరాడే సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే.. ప్రతిరోజూ కనీసం 3-4 లవంగాలు తినండి. లేదంటే పాలలో కలుపుకుని తాగితే మంచిది.
అంతేకాకుండా.. పంటి నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.. లవంగాలు రోజూ తినడం ద్వారా నోటి దుర్వాసనను తొలగిస్తుంది. లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి.. అవి దంతాలలోని క్రిములతో పోరాడడంలో సహాయపడతాయి. మరోవైపు.. దగ్గు లేదా గొంతు నొప్పికి సహాయపడతాయి. లవంగం రసం గొంతు నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అంతేకాకుండా.. ఇవి రక్తపోటును నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. లవంగాలలో మెగ్నీషియం, పొటాషియం, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజూ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.. అంతేకాకుండా.. స్టామినా కూడా పెరుగుతుంది.
Israel-Hamas War: సంధి ముగిసింది, యుద్ధం మొదలైంది.. ఇజ్రాయిల్ దాడి, 240 మంది మృతి
రోజూ ఏలకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఎక్కువగా పచ్చి ఏలకులను తింటే మంచిది. ఇవి మీ ఆహారం యొక్క రుచి, వాసనను పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పచ్చి ఏలకులలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఏలకులు.. రోజూ ఆహారంలో చేర్చుకుంటే.. గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. జనాలు తరచుగా భోజనం తర్వాత పచ్చి ఏలకులు తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే.. ఇవి నోటి దుర్వాసనను తొలగిస్తుంది.. అంతేకాకుండా.. నోటి ఇన్ఫెక్షన్, కుహరం, వాపు నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. పచ్చి ఏలకులు తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో డిటాక్సిఫైయింగ్ ఏజెంట్ ఉంటుంది. ఇది టాక్సిన్లను తొలగించి.. కాలేయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..