రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ల తరలింపు ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. 29వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్ కి పంపించ లేదు. ఈ క్రమంలో.. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఆర్డీవో కార్యాలయానికి భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో కొద్ది సేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు అధికారులు.
Read Also: Karnataka: హెల్మెట్ లేదని లాయర్‌పై పోలీసుల దాడి.. ఆరుగురు సస్పెండ్..
అయితే.. స్ట్రాంగ్ రూమ్ కు సీల్ వేయకపోవడంపై పలు అనుమానాలు తావెత్తుతున్నాయి. కాగా.. పోస్టల్ బ్యాలెట్ తరలించిన తరువాతే ఇప్పుడు సీల్ వేశారు అధికారులు. పోలింగ్ జరిగి రెండు రోజులు దాటినా.. స్ట్రాంగ్ రూమ్ కు తాళం లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు ఈ అంశంపై ఆర్డీఓను నిలదీస్తున్నారు. ఆర్డీవోను సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేస్తున్నారు.
Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు ఘాతుకం.. మందుపాతర పేలుడు, ఇద్దరు జవాన్లకు గాయాలు