నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ కు ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రూ.8 కోట్ల బకాయిలు చెల్లించని కారణంగా ఏ క్షణమైనా సీజ్ చేస్తామని మాల్ ఎదుట మైక్ లో అనౌన్స్ చేశారు అధికారులు. దీంతో.. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపారస్తులకు ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో.. మాల్ వ్యాపారంలో అయోమయంలో ఉన్నారు. మరోవైపు.. మాల్ ను స్వాధీనం చేసుకునేందుకు ఆర్టీసీ అధికారులు సిద్దమవుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్ మీటింగ్ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. సీఎం హోదాలో రేవంత్ తొలిసారి సచివాలయానికి వచ్చారు. ఆయనతో పాటు మంత్రులు కూడా సచివాలయానికి వచ్చారు. ఇదిలా ఉంటే.. సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. అదే విధంగా.. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బి.శివధర్‌రెడ్డి నియమిస్తూ.. సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకూడదని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే వాసుపల్లి, తిప్పల నాగిరెడ్డి విశాఖ కలెక్టర్ ను కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డబల్ ఎంట్రీ ఓట్లను తొలగించాలని.. వినత పత్రం సమర్పించారు.
ఎల్బీస్టేడియం నుంచి సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంకు చేరుకోనున్నారు. సీఎం రాక కోసం సెక్రటేరియట్ ను అందంగా ముస్తాబు చేశారు. అంతేకాకుండా.. కొత్త సీఎం రాక కోసం సెక్రటేరియట్ లో ఉద్యోగులు, బ్యూరోక్రాట్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉంటే.. సీఎం రేవంత్ రెడ్డికి సచివాలయ అధికారులు ఘన స్వాగతం పలకనున్నారు.
తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. అంతేకాకుండా.. రాష్ట్రం నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలో.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి పలువురు నేతలు అభినందనలు తెలుపుతున్నారు.
విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులో ఏదైనా తప్పులు ఉంటె వాటిని సరిదిద్దుకోవడానికి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE)మెయిన్స్ 2024 సెషన్ 1 అప్లికేషన్ ఫారమ్ కరెక్షన్ విండో ఓపెన్ అయింది.
తుఫాన్ కారణంగా వరి పొలాలు పూర్తిగా మునిగిపోయాయి.. తుఫాన్ సమయంలో సీఎం ఎప్పటికప్పుడు అందరినీ అప్రమత్తం చేశారు.. మా ప్రాంతంలో రైతుల పరిస్థితులను సీఎం దృష్టికి తీసుకెళ్లాం.. రైతులను పూర్తిగా ఆదుకుందామని సీఎం చెప్పారు అని ఆయన తెలిపారు. ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా సహాయం చేద్దామని చెప్పారు అని కొడాలి నాని అన్నారు.