తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రి 2గంటల సమయంలో బాత్రూంలో కాలుజారి పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కేసీఆర్ ఎడమకాలు తుంటి ఎముక విరిగిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కాగా.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ట్వీట్ చేశారు. "తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గాయపడటం బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని…
సెక్రటేరియట్లో విద్యుత్, ఆర్టీసీపై సమీక్ష ముగిసింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, కొనుగోలుపై ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2014 జూన్ 2 కంటే ముందు పరిస్థితులు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మరోవైపు.. సీఎండీ ప్రభాకర్ రావు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. విద్యుత్, ఆర్టీసీ పై అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి రివ్యూ చేస్తానని సీఎం రేవంత్ రేవంత్ తెలిపారు.
ప్రస్తుతం మనల్ని భయపెడుతున్న అతి పెద్ద సమస్య గుండెపోటు. వయసుతో సంబంధం లేకుండా చాలంది గుండెపోటు కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం గుండెపోటు మరణాలసంఖ్య గణనీయంగా పెరిగింది.
మిజోరం రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా జెడ్పీఎం పార్టీ అధ్యక్షుడు లాల్దుహోమా ఇవాళ ప్రమాణం స్వీకారం చేశారు. గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు ఆయనతో రాజ్ భవన్ లో సీఎంగా ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన పార్టీ నేతల్లో కొందరు మంత్రులుగా ప్రమాణం చేశారు.
నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న జగన్.. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం వెళ్లనున్నారు..