Visakhapatnam: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డబల్ ఎంట్రీ ఓట్లను తొలగించాలంటూ వైఎస్ఆర్సిపి నేతలు కలెక్టర్ ను కలిశారు. వివరాలలోకి వెళ్తే.. రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకూడదని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే వాసుపల్లి, తిప్పల నాగిరెడ్డి విశాఖ కలెక్టర్ ను కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డబల్ ఎంట్రీ ఓట్లను తొలగించాలని.. వినత పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ తో మాట్లాడిన నేతలు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని.. ఇందుకుగాను తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వారితో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటు వేయించాలని చూస్తున్నారని.. ప్రజలు చంద్రబాబును తిరస్కరించిన తాను మాత్రం తప్పుడు మార్గంలో అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు.
Read also:
అలానే డబల్ ఎంట్రీ ఓట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో 20 వేలకు పైగా డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని.. అందుకే మిమ్మల్ని కలుస్తున్నామని నేతలు కలెక్టర్ కి తెలిపారు. కాగా డబల్ ఎంట్రీ ఓట్ల పై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నేతలకు హామీ ఇచ్చారు. అలానే కేకే రాజు వైఎస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గ కోఆర్డినేటర్ ఓట్లు తొలగిస్తున్నారని వైఎస్ఆర్సీపీ పై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. అలానే టిడిపి హయాంలోనే పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించారని ఆరోపించారు.