అధికారంలో ఉన్నన్నాళ్లు అవినీతి, అరాచకాలతో చెలరేగిపోయి ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబ సభ్యులు సహా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన బీఆర్ఎస్ నేతల పాస్ పోర్టులను సీజ్ చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లేనిపక్షంలో వారంతా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని, వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదని చెప్పారు. కేసీఆర్ హయాంలో పదవీ విరమణ చేసినప్పటికీ సీఎంఓలో పనిచేస్తూ అడ్డగోలుగా దోచుకుంటూ కేసీఆర్ కుటుంబానికి…
అభివృద్ధి కార్యక్రమాల విషయంలో క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మంతి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తుఫాన్ వచ్చినా ప్రాణ నష్టం జరగలేదన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో శనివారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఎటాక్ చేశారు. నిజంగానే సిగ్గు పడుతున్నా.. పంట భీమా, రైతు భీమాకి తేడా లేకుండా మాట్లాడుతున్నాడు సీఎం అని ఎద్దేవా చేశారు. అందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు. 2014 వరకు ఇసుక మీద వచ్చిన ఆదాయం రూ. 39 కోట్లు.. 2014 తర్వాత ఆదాయం పెరిగిందని తెలిపారు. ఇసుక…
తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 2024 మార్చి నెలకు సంబంధించి ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగాయి. ఈ క్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. మాటలు కోటలు దాటుతున్నాయి.. ఇప్పుడే గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగితే మైక్ ఇవ్వలేదన్నారు. సీఎం స్లీపింగ్ రిమార్కు చేశారు.. సీఎం మాదిరిగా స్లీపింగ్ రిమార్కు చేయనన్నారు. ఇంకా రేవంత్ సీఎం అయినట్టు భావించడం లేదు.. ఇంకా పీసీసీ చీఫ్ అనుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీగా సాగాయి. ఈ క్రమంలో.. మళ్లీ ఈ నెల 20వ తేదీ(బుధవారం)కి స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు. అంతకుముందు గవర్నర్ ప్రసంగానికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. బీఆర్ఎస్ వైఫల్యాలపై ముఖ్యమంత్రి విరుచుకుపడగా.. అటు ప్రతిపక్ష నేత కేటీఆర్ ధీటుగా సమాధానమిచ్చారు.
శాసన మండలిలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు నెహ్రూ, కేసీఆర్, సోనియా గాంధీ అని అన్నారు. కేసీఆర్ జనాల గుండెల్లో నిలిచి పోయారని తెలిపారు. వందల ఎకరాలు ఉన్న వాళ్లకు హీరోలకు, హీరోయిన్లకు, ఐఏఎస్ లకు, ఐపీఎస్ లకు రైతు బంధు వద్దని అప్పుడు చెప్పాను.. ఇప్పుడు చెపుతున్నా అని గోరేటి వెంకన్న పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంను అధికారులు బ్లేమ్ చేశారు.. 317 జీవోను తీసుకువచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వంను బదానం…
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటకు పంపొద్దు.. వాళ్లు అన్ని వినాలని స్పీకర్ కు తెలియజేశారు. ఎంత గొడవ చేసినా బయటకు పంపొద్దు అధ్యక్ష అంటూ స్పీకర్ కు చెప్పారు. గవర్నర్ స్పీచ్ వింటుంటే సిగ్గు అనిపించింది అని కేటీఆర్ అన్నారు.. ఔను నువ్వు సిగ్గు పడాలని ముఖ్యమంత్రి విమర్శించారు. సిగ్గు పడే విషయాలు అన్ని చెప్తానన్నారు రేవంత్ రెడ్డి.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమాల నుండి వచ్చిన పార్టీ అని చెప్పుకుంటారు.. ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు తొమ్మిదిన్నర ఏండ్లలో ప్రగతి భవన్ పిలిచారా అని ప్రశ్నించారు. వాళ్ళ త్యాగం గుర్తించారా అని అన్నారు. కేసీఆర్.. అమరుల కుటుంబంకి బుక్కెడు బువ్వ పెట్టారా అని సీఎం పేర్కొన్నారు. ఆయన కుటుంబంలో అందరికి మంత్రి పదవులు ఇచ్చారు.. పేగు బంధం ఉన్నవాళ్లకు పదవులు ఇచ్చారు.. కానీ ఆత్మహత్య చేసుకున్న…