ఏలూరులో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఉపాధ్యాయ ఉద్యమ నేత, శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జీ అంతిమయాత్ర ఆదివారం ఏలూరులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏలూరుకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు సాబ్జీకి నివాళులర్పించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్ నివాసంలో రెండో పంటకు సాగు నీటి విడుదలపై సమీక్ష చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే.. నాగార్జున సాగర్ నుండి సాగునీరు విడుదల చేయలేమని సాగర్ సీఈ(CE) తెలిపారు. తాగు నీటి కోసమే నీటి విడుదల అని అధికారులు ప్రకటన చేశారు. ఈ క్రమంలో.. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులలో నీటి నిల్వలు, సాగుకు నీటి విడుదల లభ్యత…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వివాదం ప్రస్తుతం ఏపీలో దుమారాన్ని రేపుతోంది. ఈ విషయంలో సినీ నటుడు, జనసేన నేత నాగబాబుపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆయన స్పందించారు. ఓటు వ్యవహారం వివాదమవుతుందనే ఉద్దేశంతోనే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదన్నారు.
సిటీ పోలీస్ తో కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీలో డ్రగ్స్ నిర్మూలనపై చర్చించారు. రెండు నెలల్లో హైదరాబాద్ లో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మించాలని అధికారులకు సూచించారు. డ్రగ్స్ ని పూర్తిగా కట్టడి చేసేందుకు ఏర్పాటు చేయండని కమిషనర్ తెలిపారు. సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడద్దని ఆయన అన్నారు. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ వర్తిస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు…
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్ లో మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికలలో ప్రజలు మమ్ములను ప్రశ్నలు అడిగారు.. ప్రత్యర్థులు పదే పదే అబద్ధాలు చెప్పడం వల్ల సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాయని తెలిపారు. వారి విమర్శలను తిప్పికొట్టడంలో నిర్లిప్తత చేయడంతో నష్టం చేకూరిందని అన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో అప్పజెప్పాం అనే దానిపై బండి…
హైదరాబాద్ మేడిపల్లి పరిధి బోడుప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాల్ అనే బీటెక్ స్టూడెంట్ దుర్మరణం చెందాడు. విద్యార్థి బైక్ పై వెళ్తుండగా.. అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో విద్యార్థి విశాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి కారు ఢీకొన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మోపాల్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ మూర్తిని సస్పండ్ చేస్తూ సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవలో కానిస్టేబుల్ మూర్తి తలదూర్చడమే సస్పెండ్‌కు కారణమని తెలిసింది.
ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి ప్రజాభవన్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సెలబ్రేషన్ కమిటీ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు.