విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పనులు జరుగుతున్న తీరును మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పనుల కోసం రూ. 5వేల కోట్లు ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టిందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమస్ఫూర్తిని నింపిన అందెశ్రీ కవితని ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన విలక్షణ తీర్పు.. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు.. కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన విపక్షానికి లేదని విమర్శించారు. బీఆర్ఎస్ సభ్యులు తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచారు.. బీఆర్ఎస్ పార్టీ కుటుంబపాలనకే పరిమితమవుతుందని మరోసారి నిరూపించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు…
సీపీఎం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్‌కు ధన్యవాదాలు తెలిపె తీర్మానంపై చర్చ సందర్భంగా.. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కేసీఆర్ లాంటి అన్నీ తెలిసిన నాయకుడు కూడా అమలు సాధ్యంకానీ ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితబంధు హామీలిచ్చారన్నారు. ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
ఏపీలోని కర్నూలులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో కర్నూల్ నగరంలో ఓ ప్రైవేట్ లాడ్జిలో ప్రియురాలిని హత్య చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు నందికొట్కూరుకు చెందగిన విజయ్, రుక్సానాలుగా గుర్తించారు.
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. శబరిమలలో అయ్యప్పస్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్రప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో నర్సరీ మొక్కలు చాటున గంజాయిని తరలిస్తున్న ముఠాను బాలానగర్ ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీసిఎంలో నర్సరీ మొక్కల చాటున గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో.. షాపూర్ నగర్ సబ్ స్టేషన్ దగ్గర గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఇవాళ సభలో సభ్యుల చర్చ ఆరోగ్యకరంగా ఉంది.. భవిష్యత్తు కూడా ఇలాగే ఉండాలన్నారు. సభలో వ్యక్తిగత దూషణలు ఉండకుండా చూడాలి.. మార్షల్ కి పని చెప్పకుండా పని చేద్దామని కూనంనేని తెలిపారు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే భావన కలిగేలా కేటీఆర్ మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఇది మంచిది కాదు అని తన ఉద్దేశమన్నారు. తక్కువ రోజులు కాకుండా.. ఎక్కువ…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో అంగన్వాడీ సిబ్బంది ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఏపీ సర్కార్ ఓవైపు వలంటీర్లతో అంగన్వాడీ సెంటర్లు తెరిపిస్తూనే మరోవైపు అంగన్వాడీ సిబ్బందితో చర్చలు చేస్తుంది.
ఎస్సై పోస్టుల నియామకంలో అన్యాయం జరిగిందని తప్పు పిటిషన్ దాఖలు వేసిన పిటిషనర్లపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లు ప్రభుత్వ ఆసుపత్రిని శుభ్రం చేసి సామాజిక సేవ చేసేలా ఆదేశాలు ఇస్తామని హైకోర్టు పేర్కొంది.