తమ సంస్థలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఓ సంస్థ కోట్ల రూపాయలను వసూలు చేసి మోసానికి పాల్పడింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురంలో ఉన్న తన్విత ఆయుర్వేదిక్ అనే సంస్థ వారు తమ సంస్థలో లక్ష రూపాయల పెట్టుబడి పెడితే వాటితో ఆయుర్వేదిక్ వస్తువులు తయారుచేసి విక్రయించి, ప్రతి నెల లక్షకు 8…
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో శీతాకాల విడిది కోసం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ నెల 23 వరకు ఐదు రోజుల పాటు.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఏపీకి అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఇంధన శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023ని ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది.
ఏపీలో జనసేన పార్టీకి మరో బిగ్‌షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జనసేనకు చెందిన పలువురు కీలక నేతలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కృష్ణా జిల్లా పెడన జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్ వైసీపీలో చేరారు.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మాత్యులుగా పొన్నం ప్రభాకర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. మొదటగా మంత్రి తన ఛాంబర్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు మంత్రి పొన్నంకు ఆశీర్వచనాలు అందించారు. మంత్రి పొన్నం.. మొదటగా ఆర్టీసీ ఫైల్ పై రూ. 375 కోట్ల నిధులు విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. మంత్రితో రవాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణీ ప్రసాద్ సంతకం చేయించారు. ఆర్టీసీకి మూడవ త్రైమాసిక బడ్జెట్ కింద…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాక.. లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి బాధ్యతలు అప్పజెప్పింది. ఇంఛార్జీలుగా నియమించిన వారిలో ముఖ్యమంత్రితో పాటు అందరూ మంత్రులే ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండు నియోజకవర్గాలకు ఇంఛార్జీలుగా ఉన్నారు. Read Also: Ap Jobs 2023…
ఢిల్లీలో జరగనున్న ఇండియా కూటమి సమావేశానికి ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. సోమవారం ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌తో మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా కూడా పాల్గొన్నారు.
భారతదేశపు అతిపెద్ద శత్రువు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందన్న వార్త తర్వాత సోషల్ మీడియాలో అనేక వాదనలు జరుగుతున్నాయి. పాకిస్థాన్‌లో తలదాచుకున్న దావూద్ విషప్రయోగం చేశారన్న ఆరోపణలతో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ట్విట్టర్ వేదికగా చాలా మంది దావూద్‌కు విషప్రయోగం చేశారని, ఆ తర్వాత అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని పేర్కొన్నారు.
దేశంలోని ఐసిస్ తో సంబంధం ఉన్న ప్రాంతాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దాడులు చేసింది. దక్షిణాది రాష్ట్రాలోని మొత్తం 19 ప్రదేశాలలో ఎన్ఐఏ సోదాలు చేసింది. ఈ దాడిలో ఎన్ఐఏ బృందాలు ఎనిమిది మంది ఐసిస్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాదానికి సంబంధించిన చర్యలు, కార్యకలాపాలను ప్రోత్సహించడంలో వారు నిమగ్నమై ఉన్నారని ఆరోపించారు. కర్ణాటకలోని బళ్లారి, బెంగళూరు, మహారాష్ట్రలోని అమరావతి, ముంబై, పుణె, జార్ఖండ్‌లోని జంషెడ్పూర్, బొకారో, ఢిల్లీలోని ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. ఈ రైడ్స్…
దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలని, కొవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.