ప్రస్తుతం రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచింది.
ఏపీలో వైసీపీ రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు పలు సీట్లపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. సెకండ్ ఫేజ్ మార్పుల కోసం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా రంగంలోకి దిగారు. ఒకటి, రెండు రోజుల్లో కొత్త సమన్వయకర్తలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో నార్కోటిక్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఎస్సార్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్సీ పిల్స్ తీసుకొచ్చారు యువకులు. డ్రగ్స్ తో పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు అధికారులు. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలిపారు. ప్రేమ్ చంద్ అనే వ్యక్తి బర్త్…
సోమవారం లడఖ్‌లోని కార్గిల్‌లో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత ఉత్తర భారతదేశం, పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదైన ఈ ప్రకంపనలు మధ్యాహ్నం 3:48 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమని లేఖలో ప్రస్తావించారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను లేఖలో తెలిపారు బండి సంజయ్. ఒక్కో బాధిత కుటుంబానికి ఇండ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల 4 వేలు చెల్లించాలని వినతి అని పేర్కొన్నారు.
గాంధీభవన్ లో జరిగిన పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మనకోసం పని చేసిన అందరికి అందాల్సిందేనని తెలిపారు. మన ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అనేది కాదు.. మనం బీ ఫార్మ్ ఇచ్చిన నాయకుడి ద్వారానే పథకాలు అందాలని అన్నారు. మన కార్యకర్తలు సంతృప్తి పడేలా పని చేద్దామని రేవంత్ రెడ్డి నేతలకు చెప్పారు. గ్రామ సభలలోనే లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.
పవిత్ర పుణ్యక్షేత్ర తిరుమలకు నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని కనులారా దర్శించుకొసే అదృష్టం.. ప్రార్థించే అవకాశం కోసం కోట్ల మంది ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే భక్తుల సౌకర్యం కోసం.. టీటీడీ అనేక రకాల చర్యలు చేపడుతోంది.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో పీఏసీ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇదిలా ఉంటే.. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇంచార్జి మంత్రులను నియమించింది. 17 నియోజక వర్గాలకు 17 మంది మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రెండు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది పీఏసీ.
పెద్దపల్లి జిల్లా మంథని ఎంపీడీవో కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల సంక్షేమం కోసం, జవాబుదారితనంతో పనిచేస్తుందన్నారు. వ్యక్తుల కోసం కాదని మంత్రి తెలిపారు. అంతేకాకుండా.. సిటిజన్ చార్టర్ తీసుకొచ్చి పారదర్శక పాలన అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.