జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. కేంద్రాన్ని మెడలు వంచి తెలంగాణ తెచ్చినం అని చెప్పి, తెలంగాణ హక్కులను భంగం కలిగించే విధంగా 7 మండలాలను ఆంధ్రాలో కలిపారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ త్యాగంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఇదిలా ఉంటే.. ఫ్రీ…
బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఈరోజు రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన అసెంబ్లీ తొలి సెషన్ ఈరోజు రాయ్పూర్లో ప్రారంభమైంది. 71 ఏళ్ల రమణ్ సింగ్ ఆదివారం స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఛత్తీస్గఢ్ విధానసభలో అందరినీ ఏకతాటిపైకి తీసుకెళ్లడం తన కొత్త బాధ్యత అని అన్నారు.
పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలో పెద్దపులి మృతి చెందినట్లు తెలుస్తోంది. మాచర్ల సమీపంలోనీ లోయపల్లి అటవీ ప్రాంతం వద్ద జంతువు కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ఆరుగురు హత్య కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు సైకో కిల్లర్ ప్రశాంత్ తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం ఈ కేసుకు సంబధించి కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ వివరాలు వెల్లడించారు. ఒక్కొక్కరినీ ఒక్కో ప్రాంతంలో చంపినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైనట్లు వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం వారణాసి-న్యూఢిల్లీ మధ్య రెండవ వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు. అదునాతన ఫీచర్లతో తీర్చిదిద్దిన ఈ రైలుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
పార్లమెంట్లో గతవారం నెలకొన్న భద్రతా వైఫల్యం ఘటనపై ఇరు సభల్లో విపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో రాజ్యసభ, లోక్సభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. ఈ క్రమంలో లోక్సభలో ఆందోళన చేపట్టిన విపక్ష సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటువేశారు.
2023 సంవత్సరం వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కొత్త సంవత్సరం 2024కు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అయితే.. క్రికెట్ అభిమానులు కూడా ఈ సంవత్సరంలోని జ్ఞాపకాలు, మధురక్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం.. వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడం ఓ చెత్త జ్ఞాపకం. అంతేకాకుండా.. ఈ సంవత్సరం చాలా మంది ఆటగాళ్ళు క్రికెట్ కు వీడ్కోలు పలికారు. అందులో చాలా మంది ఆటగాళ్లు వన్డే…
ఈ నెల 20న(ఎల్లుండి) ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు.
పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు వైద్య శాఖ అప్రమత్తంగా, అన్నిరకాలుగా సంసిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఈ నెల 8న కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.