కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారంటీల అమలుకు వంద రోజుల వరకు ఎదురు చూస్తాం.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే నిరసన తప్పదని హెచ్చరించారు. అంతేకాకుండా.. ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు.. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని ఆయన అన్నారు. లేదంటే…
హైదరాబాద్ లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలను బల్దియా అధికారులు కూల్చేశారు. మూడు బృందాలుగా ఏర్పడి 3 జేసీబీల సాయంతో నాలుగు భవనాలను కూల్చివేశారు. శేరిలింగంపల్లి మున్సిపల్ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి ఎలాంటి అనుమతులు, సెట్బ్యాక్లు లేకుండా నిర్మిస్తున్న బిల్డర్లకు ముందుగానే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మారింది.. దానికి అగుగుణంగా వ్యవహరించాలని కోరారు. ప్రజలు మార్పు కోరుకున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ చేసింది బంగారు తెలంగాణ అయితే.. ప్రజావాణి నుండి వేల పిటిషన్లు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. కాగా.. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఆటో డ్రైవర్లు, యూనియన్లు నిరసన చేస్తున్నారు.. వారికి అండగా ఉంటాం.. వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. 15 రోజుల్లో రివ్యూ చేస్తామని…
JN.1గా గుర్తించబడిన కొత్త కొవిడ్-19 వేరియంట్ భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ నిపుణులు, అధికారులు, సాధారణ ప్రజలలో భయాందోళనను కలిగిస్తోంది. JN.1 కోవిడ్ సబ్‌వేరియంట్ మొదటగా లక్సెంబర్గ్‌లో గుర్తించబడింది. ఇది పిరోలా వేరియంట్ (BA.2.86) వారసుడిగా పరిగణించబడుతోంది. దీని మూలాలు ఒమిక్రాన్ సబ్-వేరియంట్లో ఉన్నాయి.
న్యాయస్థానం ముందు ప్రతి ఒక్కరు సమానమే. కానీ విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణకు శ్రీనివాస్ రెడ్డి బదులు డ్రైవర్ వెళ్ళటంతో న్యాయమూర్తి గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈ ఆటగాడిని రూ.24 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే వేలంపాటలో ఈ ఆటగాడిని దక్కించుకునేందుకు చివరి వరకు కోల్‌కతాతో పాటు గుజరాత్ టైటాన్స్ ప్రయత్నం చేసింది. కానీ చివరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అంతకుముందు.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 20.50 కోట్ల భారీ ధర పలికాడు. ఇప్పుడు ఆ ధరను స్టార్క్…
సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎన్ఆర్ఐ ప్రతినిధులు కలిశారు. మే 24 నుంచి 26 వరకు అమెరికాలో జరిగే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు రావాలని ఇన్విటేషన్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఎన్ఆర్ఐ సంఘం అధ్యక్షులు వంశీ రెడ్డి, ప్రతినిధులు మలిపెద్ది నవీన్, కవితా రెడ్డి, సురేష్ రెడ్డి, గణేష్, జ్యోతిరెడ్డి, మనోజ్ రెడ్డి, దుర్గాప్రసాద్, మనోహర్ తదితరులు ఉన్నారు. మరోవైపు.. ఈ నెల 23న రవీంద్రభారతిలో జరిగే సేవా డేస్…
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి నేతల కీలక సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించడానికి అవసరమైన ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించుకోవడం, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కూటమి ఎజెండాలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
దుబాయ్‌లో ఐపీఎల్ 2024 మినీ వేలం జరుగుతోంది. ఈ ఆక్షన్‌లో స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించారు. ఈ క్రమంలో.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమన్యం కివీస్ స్టార్ ప్లేయర్లను తమ జట్టులోకి తీసుకుంది. వేలంపాటలో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్‌పై కోట్ల రూపాయల వర్షం కురిసింది. ఈ క్రమంలో చివరకు చెన్నై సూపర్ కింగ్స్ డారిల్ మిచెల్‌ను 14 కోట్లు వెచ్చించి అతన్ని కొనుగోలు చేసింది. అతని బేస్ ధర రూ. 1…
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. కేంద్రాన్ని మెడలు వంచి తెలంగాణ తెచ్చినం అని చెప్పి, తెలంగాణ హక్కులను భంగం కలిగించే విధంగా 7 మండలాలను ఆంధ్రాలో కలిపారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ త్యాగంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఇదిలా ఉంటే.. ఫ్రీ…