ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. పార్టీలు అభ్యర్థుల ఖరారుపై కసరత్తును వేగవంతం చేశాయి. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ వై నాట్ 175 నినాదంతో అధికారం లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్కు షాక్లు మీద షాకులు తగులుతున్నాయి. రాష్ట్రంలో పలువురు బీఆర్ఎస్ నేతలు, నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ క్రమంలో.. నల్లగొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. రేపట్నుంచి విధులకు హాజరు కాబోమని జూడాలు ప్రకటించారు. గత మూడు నెలలుగా స్టైపెండ్ ఇవ్వకపోవడంతో రేపటి నుంచి జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు. కాగా.. రేపటి నుండి సమ్మె చేస్తామని ప్రభుత్వానికి వారు నోటీస్ ఇచ్చారు. ఈ క్రమంలో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది .రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు 10 వేల మంది వరకు ఉంటారు. అందులో.. గవర్నమెంట్ హాస్పిటల్ లో ఇంటర్న్షిప్…
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సోమవారం వారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపి మసీదుపై తన సీల్డ్ సైంటిఫిక్ సర్వే నివేదికను సమర్పించింది. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సముదాయానికి సంబంధించిన శాస్త్రీయ సర్వే నివేదికను సమర్పించేందుకు గత వారం ఏఎస్ఐకి కోర్టు వారం రోజుల గడువు ఇచ్చింది.
బీఆర్ఎస్ నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారిగా అచ్చంపేటకు వస్తున్న క్రమంలో వెల్దండ వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టుకు గల కారణాలు తెలియకపోవడంతో.. బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్డండ పీఎస్ కు భారీగా తరలి వచ్చారు. స్టేషన్ ముందు వారు ఆందోళనకు దిగారు. తమ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని పార్టీ కార్యకర్తలు పీఎస్ ముందు బైఠాయించి…
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఇస్లాం మతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఆ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇస్లాం సంస్కృతి, యూరోపిన్ నాగరికతలోని విలువలు, హక్కులకు చాలా తేడాలు ఉన్నాయని ఆమె అన్నారు.
ఇక నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనుంది ఏపీ సర్కారు. రేపటి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. రేపు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా సీఎం వైయస్.జగన్ ప్రారంభించనున్నారు.
హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆదివారం నారాయణగూడ ప్రాంతం మార్మోగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో అయ్యప్పస్వామి మహా పడిపూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస వసతులు కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరారు. ఏర్పాట్ల లేమి కారణంగా తెలుగు రాష్ట్రాల భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్ సీ మురళీధర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల…