టాలీవుడ్‌లో ఇవాళ్టి నుంచి సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి.. తెలుగు సినిమా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించారు. సినిమా షూటింగ్స్ బంద్‌కు పిలుపునిస్తూ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. సినిమా షూటింగ్‌ల విషయంలో గిల్డ్ నిర్ణయానికి ఫిల్మ్ ఛాంబర్ మద్ధతు తెలిపింది. ఓటీటీల్లో సినిమాలు రెండు మూడు వారాలకే స్ట్రీమింగ్ అవుతుండటం..పెద్ద హీరోల రెమ్యునరేషన్ లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల పారితోషికాలు హద్దులు దాటడం వంటి పరిణామాలతో.. సినిమా బడ్జెట్ కూడా నిర్మాతలు కంట్రోల్ చేయలేని పరిస్థితులు వచ్చేశాయి.. వీటితో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఇవన్నీ సెట్ అయ్యాకే సినిమా షూటింగ్ లు మొదలుపెట్టాలని నిర్ణయానికి వచ్చారు.. బంద్ ఎఫెక్ట్ బడా హీరోల సినిమాలను సైతం తాకనుంది.. మొదలయ్యే సినిమాలే కాదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా ఆగిపోనున్నాయి.. అయితే, సినిమా షూటింగ్‌ల బంద్ నిర్ణయం సరికాదు అంటున్నారు సినీ నటుడు సుమన్..
Read Also: LPG Cylinder Price: గుడ్ న్యూస్.. తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర
సినిమా షూటింగ్‌ల బంద్ నిర్ణయం వల్ల ఓటీటీలకు వాటిల్లే నష్టం ఏమీ లేదన్నారు సుమన్… మంచి కంటెంట్‌లతో సినిమా వస్తే థియేర్లలోనూ ఆదరిస్తున్నారు. అయితే, ఓటీటీ సినిమాల సెన్సార్ పై దృష్టి సారించాలని సూచించారు. ఇక, హీరోల రెమ్యునరేషన్ పై వివాదం అనవసరం అని కొట్టిపారేశారు. రెమ్యునరేషన్ తగ్గించుకోవాలనడం సబబు కాదన్న ఆయన.. ఇండస్ట్రీలో మా ఫ్యామిలీస్ అని చెప్పుకు తిరిగేవారు వాళ్ల హీరోలను తగ్గించకోమని అడగాలి హాట్ కామెంట్లు చేశారు. హీరోలకు ఉన్న ఆదరణ బట్టి రెమ్యునరేషన్ ఇస్తుంటారని తెలిపారు. షూటింగ్‌ల సమయాన్ని ప్రొడ్యూసర్లు పెంచుకోవాలని సూచించిన ఆయన.. అవసరం మేరకే కాల్షీట్లు తీసుకోవాలి.. బయ్యర్లకు నష్టం లేకుండా చూసుకోవాలన్నారు. తమళినాడులో తన సినిమాలకు వరుసగా నష్టాలు వస్తే రజనీకాంత్ రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశారు.. అలాంటి ఉదారత ఇక్కడ ఉంటే మంచిదని పేర్కొన్నారు హీరో సుమన్.