Senior Naresh: అందుకే థియేటర్లకు జనాలు రావడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Senior Naresh Tweets On Theatre Management Charges: జూన్, జులై నెలల్లో విడుదలైన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో.. జనాలు థియేటర్లకు రాకపోవడం వల్లే, అవన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయని కొందరు అభిప్రాయపడ్డారు. జనాలు ఓటీటీలకు అలవాటు పడ్డారని, మునుపటిలా థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని కూడా అన్నారు. కానీ.. కంటెంట్ ఉంటే జనాలు థియేటర్లకు తరలి వస్తారని బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలు నిరూపించాయి. థియేటర్లకు జనాలు రాకపోవడానికి ఓటీటీలు కారణం కావని ఆ చిత్రాలు చాటి చెప్పాయి. ఇలాంటి తరుణంలో.. సీనియర్ నటుడు నరేశ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనాలు థియేటర్‌కి రాకపోవడానికి ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయని ట్విటర్ మాధ్యమంగా తన అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు.
‘జనాలు థియేటర్లకు రాకపోవడానికి కారణం, టికెట్ ధరలు ఎక్కువగా ఉండటమే కాదు. పెప్సీ, పాప్ కార్న్ వంటి స్నాక్స్ ధరలు కూడా ఆకాశాన్నంటే స్థాయిలో ఉన్నాయి. రూ. 20 లేదా రూ. 30 విలువ చేసే పెప్సీ, పాప్‌కార్న్‌లను రూ. 300 కి అమ్ముతున్నారు. ఈ ఖర్చులతో కలుపుకొని, ఒక మధ్య తరగతి కుటుంబానికి ఓ సినిమా చూడాలంటే.. మొత్తంగా రూ. 2500 ఖర్చు పెట్టాల్సి వస్తోంది. జనాలు కేవలం సినిమా చూడాలని కాదు, మంచి థియేటర్ అనుభూతిని కూడా పొందాలని అనుకుంటారు. దీనిపై ఒకసారి ఆలోచించండి’’ అంటూ ఒక ట్వీట్‌లో చెప్పారు. మరో ట్వీట్‌లో.. ఇంతకుముందు ఒక యావరేజ్ సినిమా కూడా వారం రోజుల వరకు ఆడేదని, కానీ ఇప్పుడు రెండో రోజు థియేటర్లు నిండాలంటే అది ఒక గొప్ప సినిమా అయ్యుండాలని అన్నారు. ప్రతీదీ ఎక్స్‌ట్రార్డినరీ సినిమాగా తీర్చిదిద్దలేం కాబట్టి.. థియేటర్స్‌లోని స్నాక్స్ ధరలు కూడా తగ్గిస్తే, జనాలు సినిమాలు చూసేందుకు వస్తారని నరేశ్ చెప్పుకొచ్చారు.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
Y are people not coming to theatres? Simple. a middle class family needs about rs 2500 avg for the experience . Not just the tickets rates . If pepsi or pop corn which cost rs 20 or 30 costs about rs 300 . So people don’t want just a good film but. A good experience. Think!!!
— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) August 27, 2022
What i mean to say is even an average film used to have collections for a week but now it needs to be a great film to fill the theatres the 2nd day. How many Extrodinary films can we make . So reduction of costs in the theatres can bring more people to many more films
— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) August 27, 2022
తాజావార్తలు
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!