పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జులై 23న బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్స్ షోలు వేశారు. సినిమా ప్రీమియర్ షో చూసేందుకు పలు రెండు రాష్ట్రాల్లోని పలు థియేటర్లకు పవన్ కల్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. టికెట్ ఉన్న వారిని మాత్రమే థియేటర్ లోపలికి పంపించారు. రద్దీని నియంత్రించేందుకు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన డ్రామా జూనియర్స్తో పాటు మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న సినిమా గురించి బలమైన విషయాలు పంచుకున్నారు. అయితే ఆయన వెంకటేష్ పాత్ర గురించి మాత్రం ఎలాంటి వివరాలు బయట పెట్టలేదు. నిజానికి…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ సినిమా షూటింగ్ జోరందుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పెద్ది’ సినిమా కోసం హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త! ఆయన నటిస్తున్న భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ జూన్ నెల నుంచి జోరందుకోనుంది. గతంలో సూపర్ హిట్ చిత్రం ‘గబ్బర్ సింగ్’ కాంబోలో దర్శకుడు హరీష్ శంకర్‌తో పవన్ కళ్యాణ్ మరోసారి జతకట్టడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్గా రూపొందనుందని సమాచారం, ఇది అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ రంగంలో…
NTV Film Roundup: Telugu Movie Shooting Updates 9th December 2023: ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా టాలీవుడ్ లో జరుగుతున్న షూటింగ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం చదివేయండి. ప్రస్తుతానికి బడా సినిమాలన్నీ దాదాపు సెట్స్ మీదనే ఉన్న సంగతి తెలిసిందే. 1. #NBK109 – Nandamuri Balakrishna Shooting Update: ముందుగా బాలకృష్ణ సినిమా విషయానికి వస్తే బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని ఉదగమండలం…
Nia Tripathi:చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఉన్నత చదువులు చదివిన వాళ్లు కూడా నటన మీద ఆసక్తితో సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. సినీ వారసుల సంగతి పక్కన పెడితే, సాధారణ కుటుంబాల్లోని వారూ ఫిల్మ్ ఇండస్ట్రీని చూజ్ చేసుకుంటున్నారు. అలా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ చేసి, ఆపైన బెంగళూరులో ఎంబీఏలో ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్‌లో శిక్షణ తీసుకుని చివరకు మోడల్ కమ్ యాక్టర్ గా సెటిల్ అయ్యింది నియా త్రిపాఠి.…
ఇవాళ్టి రోజుకో ప్రత్యేకత ఉంది. 22.02.2022! ఎటు నుండి చూసిన ఒకటే!! అంతేకాదు… ఇవాళ దర్శకుడు తేజ పుట్టిన రోజు కూడా. ఈ సందర్భంగా డి. రామానాయుడు మనవడు, సురేశ్ బాబు రెండో కొడుకు అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ తెరకెక్కిస్తున్న మూవీ టైటిల్ ను ప్రకటించారు. ‘అహింస’ అనే ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే, తేజ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ సినిమాను ప్రారంభించారు.…
ఈ నెల 25న రావాల్సిన వరుణ్ తేజ్ ‘గని’ సినిమా, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ఆగమనంతో వెనక్కి వెళ్ళింది. అయితే ముందు ‘గని’ చిత్ర దర్శక నిర్మాతలు, ఫిబ్రవరి 25 లేదంటే మార్చి 4న తమ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. అలానే ఈ నెల 25న రావాల్సిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియన్’ చిత్రాలు మార్చి 4కు పోస్ట్ అయ్యాయి. కానీ ‘గని’ మాత్రం మార్చి 4న కూడా రాకపోవచ్చు! తాజాగా ఈ చిత్ర…