మెగాస్టార్ ప్రస్తుతం వసిష్ఠతో ‘విశ్వంభర’ ముగించి అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఇప్పుడీ రెండు ప్రాజెక్ట్‌లు కాకుండా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళేదుకు రెడీ అయ్యారు. అందుకు దర్శకుడు బాబీతో మెగాస్టార్ చేతులు కలిపాడు. గతంలో ఈ కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళి బాబీ – చిరు రిపీట్ కాబోతుంది. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. మెగాస్టార్ తో సినిమా కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథ రెడీ చేసాడట. ఈ ఏడాది సెప్టెంబర్ లో బాబీ – మెగాస్టార్ సినిమాల మొదలు కానుంది.
Also Read ; Coolie : లోకేష్ కనకరాజ్ ‘కూలీ’ కథ నేపధ్యం ఇదే.. తేడా వస్తే అంతే సంగతులు
అయితే ఈ సినిమాను సినిమాటోగ్రాఫర్ గా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ను ఫిక్స్ చేసారు. నిఖిల్ హీరోగా వచ్చిన సూర్య vs సూర్య అలానే మాస్ మహారాజ్ తో ఈగల్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కార్తీక్ ఘట్టమనేని ఇప్పడు చిరు – బాబీ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించబోతున్నాడు. ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జా, మంచు మనోజ్ కీలక పాత్రల్లో మిరాయ్ అనే తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకుంది. మిరాయ్ సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. ఆ వెంటనే చిరు సినిమాకు వర్క్ చేయబోతున్నాడు కార్తీక్. బాబీ, చిరుల వాల్తేర్ వీరయ్యకు సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు డీవోపీగా చేసారు. విశ్వంభర కూడా ఛోటానే డీవోపీ. ఈ సారి ఇద్దరి కాంబోలో రాబోయే సినిమాకు యంగ్ టాలెంట్ కావాలని కార్తీక్ ఘట్టమనేనిని తీసుకున్నట్టు ఉన్నారేమో బహుశా.