Nikhil Abburi : చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులగా చేసిన తర్వాత పెద్దయ్యాక ఇండస్ట్రీలోనే కీలక నటులుగా ఎదుగుతున్నారు. కొందరు హీరోలుగా కూడా మారుతున్నారు. తాజాగా అలాంటి నటుడి గురించే చర్చ జరుగుతోంది. నాగచైతన్య, తమన్నా కాంబోలో సుకుమార్ తీసిన 100% లవ్ అందరికీ గుర్తుండిపోతుంది. ఆ సినిమాలో క్యూట్ గా ఓ బుడ్డోడు ఉంటాడు. తమన్నాకు ఫుల్ సపోర్టుగా నిలుస్తుంటాడు. ఆ బుడ్డోడు సత్యంరాజేశ్ ను ఆటపట్టించే సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. అతని పేరే నిఖిల్ అబ్బూరి. ఇతను చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసి మెప్పించాడు. ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు. నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 90’s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి టాక్స్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న లిటిల్ హార్ట్స్ మూవీలో నిఖిల్ అబ్బూరి కీలక పాత్రలో నటించాడు.
Read Also : Dasari Kiran : వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్
ఈ మూవీ టీజర్ ఇప్పటికే వచ్చి ఆకట్టుకుంది. ఇందులో మౌళి వెనకాల ఉండే గ్యాంగ్ లో నిఖిల్ కనిపిస్తుంటాడు. ఇతన్ని చాలా మంది గుర్తు పట్టలేదు. కాగా మూవీ ఈవెంట్ మొన్న నిర్వహించగా.. అందులో నిఖిల్ ను మౌళి స్టేజిమీదకు పిలిచి పరిచయం చేశాడు. దాంతో అంతా ఆశ్చర్యపోయారు. నిఖిల్ ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. 100% లవ్ లో అంత చిన్నపిల్లాడిగా కనిపించిన ఇతను.. ఇంత త్వరగా ఎలా పెద్దోడు అయిపోయాడో అని అంతా షాక్ అవుతున్నారు. ఇక లిటిల్ హార్ట్స్ సినిమా కోచింగ్ సెంటర్ల బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నారు. సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాతో తనకు మంచి గుర్తింపు రావాలని నిఖిల్ కోరుకుంటున్నాడు. బన్నీ వాస్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు.
Read Also : JR NTR : ఎన్టీఆర్ కోసం జపాన్ నుంచి వచ్చిన అమ్మాయి..