Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ బాబీ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది నుంచి స్టార్ట్ కాబోతోంది. ఆ లోపు చిరంజీవి కోసం మంచి హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డాడంట డైరెక్టర్ బాబీ. చిరంజీవి కోసం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను పరిశీలిస్తున్నాడంట డైరెక్టర్ బాబీ. అందులో భాగంగా రాశిఖన్నాతో రీసెంట్ గానే చర్చించాడు. రాశిఖన్నాకు మెగా హీరోలతో మంచి బాండింగ్ ఉంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు అన్నయ్య చిరంజీవితో కూడా నటించే ఛాన్స్ కొట్టేయడానికి రెడీ అవుతోంది.
Read Also : Keerthi Suresh : జగపతిబాబుకు కీర్తి సురేష్ క్షమాపణలు.. ఎందుకంటే..?
ఇంకో హీరోయిన్ పాత్ర కోసం మాళవిక మోహనన్ ను సంప్రదిస్తున్నాడంట బాబీ. ఆమె ప్రస్తుతం ది రాజాసాబ్ సినిమా షూటింగులో ఫుల్ బిజీగా ఉంది. ఆ మూవీ షూటింగ్ అయిపోగానే చిరంజీవితో సినిమాకు డేట్స్ ఇవ్వాలని కోరాడంట. కానీ ఇప్పుడిప్పుడే తనకు పెద్ద పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో అంత సీనియర్ హీరో పక్కన చేయాలా వద్దా అనే అనుమానంలో ఉందంట ఈ బ్యూటీ. అన్నీ కుదిరితే ఆమె ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే నిధి అగర్వాల్ ను తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇందులో ఎవరు ఫైనల్ అవుతారో వెయిట్ చేయాల్సిందే.