Mega 157 : మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మెగా 157 మూవీపై మంచి బజ్ పెరిగింది. కామెడీ ట్రాక్ లో వస్తున్నందున అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా ప్రతి అప్డేట్ ను ప్రమోషన్ చేస్తూ హైప్ పెంచుతున్నాడు అనిల్. తాజాగా మూవీ గురించి సాలీడ్ అప్డేట్ రాబోతున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న రాబోతోంది. ఆ స్పెషల్ డే రోజున మూవీ నుంచి అప్డేట్ వస్తుందని అప్పటి దాకా వెయిట్ చేయాలంటూ ట్వీట్ చేశాడు అనిల్ రావిపూడి. దీంతో ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Coolie : కేరళలో కూలీ క్రేజ్.. టికెట్ల కోసం ఎగబడుతున్న ఫ్యాన్స్
చూస్తుంటే ఆ రోజు టీజర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. కీలక సన్నివేశాలు అన్నీ కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే కేరళ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ వచ్చేసింది మూవీ టీమ్. ఇందులో చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. పైగా రీ ఎంట్రీ తర్వాత చిరు చేస్తున్న ఫస్ట్ కామెడీ మూవీ ఇదే. కామెడీలో చిరుకు మంచి టైమింగ్ ఉంది. గతంలో ఆయన ఎన్నో కామెడీ సినిమాలతో అలరించారు. కాబట్టి చిరంజీవిని మళ్లీ కామెడీ రోల్ లో చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
Read Also : The Paradise : ది ప్యారడైజ్ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..