హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీ పై కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఆరోపణలు మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. వాటిపై ఒక క్లారిటీ ఇస్తూ చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సమావేశంలో చిత్రపరి కాలనీలో కొత్తగా నిర్మించబోతున్న సఫైర్ సూట్, రో హౌసెస్, డూప్లెక్స్ తదితర నిర్మాణాలకు సంబంధించి అలాగే టవర్స్ కి సంబంధించిన వాటిపై క్లారిటీ ఇచ్చారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ కాలనీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు, అలాగే కోట్ల…
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు నివాళి అర్పిస్తూ కోట శ్రీనివాసరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. శేఖర్ కమ్ముల : నాకు చాలా మంచి స్నేహితుడు, ఇష్టమైన వ్యక్తి కోటా శ్రీనివాసరావు. తెలుగు సినిమా కోసం ఏదైనా చేసెందుకు సిద్ధంగా ఉంటారు కోట. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల మనిషి కోటా శ్రీనివాసరావు. కాల్ షీట్స్ విషయంలో ఏమాత్రం సమస్య లేకుండా సహకరించే వారు. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి…
AP Deputy CM Pawan: తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
CM Revanth Reddy: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటని తెలిపారు.
ఇవాళ కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జరగబోతున్నాయి. జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలోనే అంత్యక్రియలు జరగనున్నాయి. నేటి మధ్యాహ్నం 12:30 గంటలకు కోట శ్రీనివాసరావు అంతిమ యాత్ర స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో... మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.
CM Chandrababu: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఈరోజు తెల్లవారు జామున తుదిశ్యాస విడిచారు. కోట శ్రీనివాసరావు మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు.
Kota Srinivasa Rao: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈరోజు తెల్లవారు జామున 4 గంటల సమయంలో తుదిశ్యాస విడిచారు.
Vadde Naveen : ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోలు కాలగమణంలో కనిపించకుండా పోయారు. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న వారు ఎంతో మంది. జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి వారు విలన్ పాత్రల్లో రీ ఎంట్రీ ఇచ్చి అరదగొడుతున్నారు. ఇలాంటి కోవలోకే వడ్డే నవీన్ వస్తాడని అంతా అనుకున్నారు. ఆయన ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ముఖ్యంగా యూత్ ఫుల్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాల్లో ఆయనకు మంచి ఫ్యాన్ బేస్…
Udayabhanu : యాంకర్ ఉదయభాను సంచలన కామెంట్స్ చేసింది. తెలుగు యాంకరింగ్ ఫీల్డ్ లో భారీగా సిండికేడ్ ఎదిగింది.. రేపు ఈవెంట్ ఉండగా.. చేస్తామో లేదో గంట ముందు వరకు గ్యారెంటీ ఉండదని స్టేజిమీదే తేల్చి చెప్పేసింది. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సుహాస్ హీరోగా వస్తున్న ఓభామ అయ్యోరామ ఈవెంట్ కు ఉదయభాను యాంకరింగ్ చేసింది. ఆమె చాలా ఏళ్ల తర్వాత ఈవెంట్ చేయడంతో ఒకతను మాట్లాడుతూ.. ఉదయ భాను గారు చాలా…
థియేటర్ల బంద్ పిలుపు నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో టాలీవుడ్ సినీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసేందుకు నిర్ణయించారు. అందుకోసం టాలీవుడ్ నుండి ఎవరెవరు వెళ్లాలి అనే దానిపై మీటింగ్స్ కూడా నిర్వహించి కొందరి పేర్లతో లిస్ట్ కూడా రెడీ చేసారు. వారిలో పలువురు ప్రముఖ స్టార్ హీరోలు, నిర్మాతలు దర్శకులు ఉన్నారు. Also Read : HHVM : హరిహర… ఏమిటా…