Udayabhanu : యాంకర్ ఉదయభాను సంచలన కామెంట్స్ చేసింది. తెలుగు యాంకరింగ్ ఫీల్డ్ లో భారీగా సిండికేడ్ ఎదిగింది.. రేపు ఈవెంట్ ఉండగా.. చేస్తామో లేదో గంట ముందు వరకు గ్యారెంటీ ఉండదని స్టేజిమీదే తేల్చి చెప్పేసింది. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సుహాస్ హీరోగా వస్తున్న ఓభామ అయ్యోరామ ఈవెంట్ కు ఉదయభాను యాంకరింగ్ చేసింది. ఆమె చాలా ఏళ్ల తర్వాత ఈవెంట్ చేయడంతో ఒకతను మాట్లాడుతూ.. ఉదయ భాను గారు చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నారు. ఆమె ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని అన్నాడు. దానికి ఉదయభాను మాట్లాడుతూ ‘అంత లేదు. మళ్లీ చేస్తానో లేదో గ్యారెంటీ లేదు.
Read Also : AlluArjun-Atlee : బన్నీ-అట్లీ మూవీ.. విలన్ ఎవరో తెలుసా..?
రేపు ఈవెంట్ ఉంది అనగా.. గంట ముందు వరకు ఉంటామో లేదో తెలియదు. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇక్కడ. ఏం చెప్పినా హార్ట్ లో నుంచే చెప్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఉదయభాను. ఆమె చెప్పిన మాటలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలో ప్రతి ఈవెంట్ లో కామన్ గా ఒకరిద్దరు యాంకర్లు మాత్రమే కనిపించడం ఈ మధ్య పరిపాటి అయిపోయింది. చిన్న ఈవెంట్లు అయితే వేరే వాళ్లు కనిపిస్తున్నారు గానీ.. ఏదైనా పెద్ద సినిమా ఈవెంట్లు అయితే కామన్ గా కనిపించే వారు ఒకరిద్దరు మాత్రమే ఉంటున్నారు. దీనిపై ఎప్పటి నుంచో పెద్ద చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉదయభాను చేసిన కామెంట్లు ఇప్పుడు వాటికి బలాన్నిస్తున్నాయి. ఒకప్పుడు ఉదయభాను స్టార్ యాంకర్ గా దూసుకుపోయింది. కానీ పెళ్లి తర్వాత పెద్దగా కనిపించట్లేదు. మళ్లీ ఈవెంట్లు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Read Also : IND vs ENG 3rd Test: కరుణ్ నాయర్ వద్దు.. ఆ స్థానంలో సాయి సరిగ్గా సరిపోతాడు!