తెలుగు నాట సినీ పరిశ్రమను, రాజకీయాలను వేరువేరుగా చూడటం కష్టం. ఆ లింకులన్నీ అలా సింక్ అయి ఉంటాయి మరి. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందట. తమకు ఆర్ధిక సమస్యలు ఉన్నాయంటూ... సినీ ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ముందు ప్రకటించి తర్వాత అది వివాదాస్పదం కావడంతో.... ఉపసంహరించుకున్నారు. ఎగ్జిబిటర్ల ఉద్దేశ్యం ఏదైనా... దాని మీద భిన్న వాదనలున్నా.... బంద్ ప్రకటనతో పవన్‌కళ్యాణ్‌కు మాత్రం కాలిపోయిందట. తన సినిమా…
తెలుగు సినిమా ఇండస్ట్రీ (టాలీవుడ్) రేంజ్ రోజురోజుకీ మారిపోతోంది. భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తమిళ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కథ మీద దృష్టి పెట్టకుండా, మంచి రెమ్యునరేషన్ ఇస్తే చాలు.. డేట్స్ ఇచ్చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో తమిళ స్టార్స్ టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. Also Read:Allu Arjun : అట్లీ మూవీలో యానిమేటెడ్ రోల్ చేస్తున్న బన్నీ..?…
తెలుగు చిత్ర పరిశ్రమలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేతకు సంబంధించిన కీలక నిర్ణయం జూన్ 1, 2025 నుంచి అమలులోకి రావాల్సి ఉండగా, తాజా చర్చల తర్వాత ఈ నిర్ణయం వాయిదా పడింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మే 21, 2025న హైదరాబాద్‌లో జరిగిన సమావేశాలు ఈ విషయంలో కీలక పరిణామంగా నిలిచాయి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య జరిగిన వాడివేడి చర్చలు పరిశ్రమలో సామరస్యాన్ని కాపాడే దిశగా ఒక అడుగు ముందుకు వేశాయి. మే…
తెలుగు చిత్ర పరిశ్రమలో సింగిల్ థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు సంబంధించి రెంట్ (అద్దె) విధానం, పర్సంటేజ్ (షేరింగ్) విధానంపై ఎగ్జిబిటర్లు – నిర్మాతల మధ్య మొదలైన వివాదం అనేక మలుపులు తిరుగుతూ వెళ్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ప్రస్తుతం రెంటల్ విధానంపై ఎక్కువగా నడుస్తున్నాయి. ఈ విధానంలో నిర్మాతలు థియేటర్లకు నిర్ణీత అద్దె చెల్లించి సినిమాలను ప్రదర్శిస్తారు. అయితే, కలెక్షన్లు తక్కువగా ఉన్నప్పుడు థియేటర్లు షోలను రద్దు చేయడం లేదా మూసివేయడం వంటి…
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిత్రపురి కాలనీ నూతన ప్రాజెక్ట్, భవిష్యత్ కార్యాచరణ గురించి సోమవారం జరిగిన కార్యక్రమం లో సభ్యులు వెల్లడించారు. త్వరలోనే భూమి పూజ ఉంటుందని అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ వెల్లడించారు. నూతన ప్రాజెక్ట్ SAPPHIRE SUITE’ కు సంబందించిన బ్రోచర్ ను విడుదల చేసారు. వల్లభనేని అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ “1994లో మొదటిసారి చిత్రపురి కాలనీ అనే ప్రాజెక్టు మొదలైంది. ఇప్పుడు కట్టబోయే ప్రాజెక్ట్‌కు షఫైర్ సూట్ పేరుతో మొదలుపెట్టాం. పెండింగ్‌లో ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత.…
Betting Apps : ఇంటర్నెట్ విస్తృతంగా ప్రాచుర్యం పొందిన తర్వాత, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు, వీటి అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు మియాపూర్ పోలీసులు మరింత ఉగ్రరూపం దాల్చారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన విచారణను వేగవంతం చేస్తూ పలు ప్రముఖ కంపెనీలపై కేసులు నమోదు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను సినీ సెలెబ్రిటీలు, యూట్యూబర్లు భారీగా ప్రమోట్ చేయడం ఇప్పుడు పోలీసుల దృష్టిని ఆకర్షించింది. ఈ యాప్స్ పై దర్యాప్తు…
Balakrishna : తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం అందజేసిన సంగతి తెలిసిందే.
Bhatti Vikramarka : ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు. జాతీయ సమైక్యత, ఐక్యతను…
Suresh Babu : నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో “అన్‌స్టాపబుల్” 4వ సీజన్ తాజా ఎపిసోడ్లో ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు, హీరో విక్టరీ వెంకటేష్ గెస్టులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు తన జీవితంలోని విశేషాలను పంచుకుంటూ, ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. బాలకృష్ణ అడిగిన “అందంగా ఉండి కూడా హీరో కాకుండా నిర్మాతగా ఎందుకు మారారు?” అనే ప్రశ్నకు సురేష్ బాబు స్పందిస్తూ, తనకు సినిమారంగం పట్ల మొదట ఆసక్తే లేదని…
హీరో అల్లు అర్జున్ మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్లారు. నాగబాబు ఇంటికి తన భార్య స్నేహారెడ్డితో కలిసి చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అరెస్ట్ పరిణామాలపై వీరిద్దరూ చర్చించారు. అంతకు ముందు అల్లు అర్జున్ సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు.