Vadde Naveen : ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోలు కాలగమణంలో కనిపించకుండా పోయారు. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న వారు ఎంతో మంది. జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి వారు విలన్ పాత్రల్లో రీ ఎంట్రీ ఇచ్చి అరదగొడుతున్నారు. ఇలాంటి కోవలోకే వడ్డే నవీన్ వస్తాడని అంతా అనుకున్నారు. ఆయన ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ముఖ్యంగా యూత్ ఫుల్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాల్లో ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉండేది. కానీ మాస్ ఇమేజ్ లేకపోవడంతో సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. అప్పటి నుంచి వడ్డే నవీన్ పెద్దగా మూవీల్లో కనిపించట్లేదు. తొమ్మిదేళ్ల క్రితం 2016లో ఎటాక్ సినిమాలో నటించాడు.
Read Also : Narayanan Murthy : అణుబాంబు కన్నా ప్రమాదమే.. ఆర్.నారాయణ మూర్తి షాకింగ్ కామెంట్స్..
ఇప్పుడు నటుడుగా రీ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. విలన్ గా చేస్తాడని అనుకున్నారు. కానీ నిర్మాతగా అవతారం ఎత్తాడు. వడ్డే క్రియేషన్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఇందులో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. నటుడుగా రీ ఎంట్రీ ఇస్తాడేమో అనుకుంటే ఇప్పుడు నిర్మాతగా వస్తున్నాడు. మొత్తానికి వడ్డే నవీన్ చాలా కాలం తర్వాత ఇలా రీ ఎంట్రీ ఇవ్వడం ఆయన ఫ్యాన్స్ కు సంతోషమే. కాకపోతే ఆయన్ను నటుడిగా తెరమీద చూసేందుకే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వడ్డే నవీన్ హీరోగానే కాకుండా వ్యాపారంలో కూడా బాగానే సంపాదించాడు. ఇన్నేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పుడు ఆ సంపాదన మీదనే బిజీగా ఉన్నాడంట. మరి ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి.
Read Also : Saipallavi : సాయిపల్లవి సీత పాత్రకు సరిపోదంట.. నార్త్ మీడియా అక్కసు..