తెలుగు సినీ పరిశ్రమలో వేతన పెంపు డిమాండ్ నేపథ్యంలో, నిర్మాత సీ కళ్యాణ్‌తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు నిర్వహించిన సమావేశం పరిశ్రమలో కీలక పరిణామంగా మారింది. 30% వేతన పెంపు డిమాండ్‌తో ఫిల్మ్ ఫెడరేషన్ షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయించడం, ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించిన కొందరిపై చర్యలు తీసుకోవడం వంటి సంఘటనలు సినీ పరిశ్రమలో ఉద్రిక్తతలను పెంచాయి. ఈ సమావేశంలో సినీ కార్మికుల వేతన పెంపు డిమాండ్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. కార్మికులు 30% వేతన పెంపు కోసం…
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల 30% వేతన పెంపు డిమాండ్‌తో జరుగుతున్న సమ్మె వివాదంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు. కార్మికుల డిమాండ్లపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. Also Read : Film Federation: కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాము.. దోచుకోవడం మా ఉద్దేశం కాదు మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కార్మికులకు…
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల 30% వేతన పెంపు డిమాండ్‌తో జరుగుతున్న సమ్మె వివాదం పరిష్కారం కోసం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేతలు లేబర్ కమిషన్ కార్యాలయంలో అదనపు కమిషనర్ గంగాధర్‌తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తమ వాదనలను వివరించారు. అనంతరం వల్లభనేని అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “కార్మికుల వేతనాల అంశంపై మేము అదనపు కమిషనర్ గంగాధర్‌ను కలిసాము. లేబర్ కమిషన్ ఒక పర్సెంటేజ్…
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్‌లు నిలిచిపోయిన నేపథ్యంలో, ఈ వివాదం పరిష్కారం కోసం ప్రముఖ నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సమావేశమయ్యారు. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ 30% వేతన పెంపు డిమాండ్‌తో సమ్మె ప్రకటించడంతో, నిర్మాతలు ఈ సమస్యపై చిరంజీవి ఇంట్లో చర్చించారు. ఈ సమావేశంలో యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులైన అల్లు అరవింద్, సుప్రియ యార్లగడ్డ, మైత్రీ రవి, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, కె.ఎల్. నారాయణ…
సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై యాక్టివ్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరుగా ఉన్న టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ సమస్య మీద తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నిజానికి తమకు వేతనాలు పెంచి ఇచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్న ఆయన, స్కిల్డ్ వర్కర్స్ లేనప్పుడు ఇప్పుడు ఇస్తున్న వేతనాలే ఇబ్బందికరంగా అనిపిస్తోందని అన్నారు. అలాంటిది స్కిల్ లేకుండా ఇప్పుడు ఇంకా జీతాలు పెంచి వాళ్లకు ఇవ్వడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారుతుందని…
తెలుగు సినీ పరిశ్రమలో 30% వేతనాల పెంపు కోసం తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ఈ వివాదం పరిష్కారం కోసం లేబర్ డిపార్ట్మెంట్ అడిషనల్ కమిషనర్ గంగాధర్ ఎన్టీవీతో కీలక ప్రకటనలు చేశారు. సినీ కార్మికుల ఫెడరేషన్ ఈ విషయంపై తమను సంప్రదించినట్లు ఆయన తెలిపారు. 2022లో చివరిసారిగా వేతనాలు సవరించిన తర్వాత, మూడేళ్ల వ్యవధిలో 30% వేతన పెంపు ఒప్పందం ప్రకారం అమలు చేయాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. అయితే, ప్రస్తుతం సినీ…
సినీ పరిశ్రమలో ఫిల్మ్ ఫెడరేషన్ తరపున యూనియన్ సభ్యులందరూ కలిసి 30% వేతనాల పెంపు కోసం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2022లో చివరిగా వేతనాలు పెంచారు. ఆ తర్వాత మూడేళ్ల తరువాత ఈ వేతనాల పెంపు ఉండేలా ఒప్పందాలు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమ నష్టాలలో నడుస్తున్న నేపథ్యంలో నిర్మాతలు మాత్రం ఆ పెంపుకు సుముఖంగా లేరు. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కేవలం పెంచిన వారి షూటింగ్స్‌కి…
తమకు వేతనాలు పెంచాలని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ తరపున అన్ని యూనియన్ నాయకులు తెలుగు సినీ నిర్మాతలకు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. తెలివిగా బంద్ అని ప్రకటించకుండా వేతనాలు పెంచిన వారి షూటింగ్స్‌కి మాత్రమే వెళతామని వారు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం సరికాదని లేబర్ కమిషనర్ ముందుకు వెళ్లిన ఫిల్మ్ ఛాంబర్ సహా నిర్మాతల మండలి సభ్యులు ఇప్పటికే ఈ విషయం మీద పవన్ కళ్యాణ్‌తో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు…
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపుపై చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి ప్రతినిధులు కార్మిక శాఖ కమిషనర్‌ను కలిసి వేతనాల సమస్యపై చర్చించడానికి రెండు రోజుల గడువు కోరారు. తెలుగు సినీ వర్కర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు కూడా ఈ సమస్యపై కమిషనర్‌తో ఇటీవల సమావేశమై, వేతనాల పెంపు డిమాండ్‌ను గట్టిగా విన్నవించారు. Also Read:Mayasabha: ఆసక్తికరంగా ‘మయసభ’ ట్రైలర్ కార్మిక శాఖ కమిషనర్, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ ప్రతినిధులకు…
సినిమాలకు పని చేసే వివిధ క్రాఫ్ట్స్ లోని కార్మికుల రోజు వారి వేతనాల పెంపు విషయంలో నిన్న ఫిలిం ఛాంబర్ లో కీలక సమావేశం జరిగింది. ఇంటర్నల్ గా జరిగిన సమావేశంలో నిర్మాతలు ఛాంబర్ సభ్యులు తో ఫెడరేషన్ నాయకుల భేటీ అయ్యారు. వేతనాలు పెంపు విషయంలో ఫిల్మ్ ఛాంబర్ – తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మధ్య ఇరువురు మధ్య వాడివేడిగ చర్చిలు జరిగాయి. కార్మికులకు ప్రతీ మూడేళ్లకోసారి 30% పెంచాలనే నిబంధన గత నెల…