Kota Srinivasa Rao Last Rites: తెలుగు సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఈరోజు తెల్లవారు జామున తుదిశ్యాస విడిచారు. అయితే, గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు ఈ ఉదయం మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక, కోట శ్రీనివాసరావు మృతి చెందిన నేపథ్యంలో అంత్యక్రియలకు ఏర్పాటు కొనసాగుతున్నాయి.
Read Also: KOTA : రాజకీయాల్లోను ‘కోట’ ముద్ర.. ఎక్కడ నుండి ఎమ్మెల్యేగా గెలిచారో తెలుసా.?
అయితే, ఇవాళ కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జరగబోతున్నాయి. జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలోనే అంత్యక్రియలు జరగనున్నాయి. నేటి మధ్యాహ్నం 12:30 గంటలకు కోట శ్రీనివాసరావు అంతిమ యాత్ర స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో… మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం హైదరాబాద్ లోనే ఉన్నారని సమాచారం.
Read Also: Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావు జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్..
ఈ నేపథ్యంలో ఇవాళ కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా.. కోట శ్రీనివాసరావు మృతి చెందడంతో టాలీవుడ్ కి సంబంధించిన ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. అటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ పార్టీ నేతలు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.