టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు నివాళి అర్పిస్తూ కోట శ్రీనివాసరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
శేఖర్ కమ్ముల : నాకు చాలా మంచి స్నేహితుడు, ఇష్టమైన వ్యక్తి కోటా శ్రీనివాసరావు. తెలుగు సినిమా కోసం ఏదైనా చేసెందుకు సిద్ధంగా ఉంటారు కోట. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల మనిషి కోటా శ్రీనివాసరావు. కాల్ షీట్స్ విషయంలో ఏమాత్రం సమస్య లేకుండా సహకరించే వారు. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్న.
వందేమాతరం శ్రీనివాస్ : గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి కోట శ్రీనివాసరావు. ఆయన్ని కోల్పోవడం బాధాకరం. లైఫ్ లో గొప్ప అచీవ్మెంట్ చేశారు.సోదరులాగా కలిసిమెలిసి ఉండేది నాతో.
రాజీవ్ కనకాల : కోటాగారితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు బాషా, సినిమా అభివృద్ధికి కష్టపడిన వ్యక్తి కోటా. మా అసోసియేషన్ లో ఆయన కృషి అద్భుతం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను.
ప్రకాష్ రాజ్ : కోటా చాలా విశిష్టమైన వ్యక్తి. అద్భుతమైన నటుడు కోటా శ్రీనివాసరావు. కోట నటన నాకు చాలా నచ్చేది. సీనిపరిశ్రమ కు ఆయన లోటు ఉండేది. ప్రకాష్ రాజు మనవాడు కాదు అంటే… తెలుగు బాగా నేర్చుకొని నటిస్తున్నాడు అని మద్దతు ప్రకటించే వారు…ఇటీవల ఆయనకు అనారోగ్యం ఉండేది. ఏజ్ భారం అది అందరికీ సాధారణమే. కోటా శ్రీనివాస్ అన్ని రకాలుగా సహకరించారు వ్యక్తిగతంగా నేను చాలా మిస్ అవుతున్నాను. ఏ విషయమైనా ముక్కు సూటిగా మాట్లాడేవారు. ఏదో డైలాగ్ చూసి చెప్పేయడం కాదు, అందులో జీవించి చెప్పడం కోటాకి వెన్నతో పెట్టిన విద్య. నాపై కూడా సెటైర్లు వేసేవాడు నేను సంతోషంగా స్వీకరించే వాన్నీ. కోట శ్రీనివాసరావు లేరన్న వార్త సినీ పరిశ్రమ తీరనిలోటు