తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు 30 మంది సభ్యులతో కూడిన ఒక ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఈ కమిటీలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి సమానంగా ప్రాతినిధ్యం వహించే సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. Also Read:Deepika : స్పిరిట్ vs AA22xA6.. దీపిక చేసింది కరెక్టేనా? తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్…
ఈ రోజుల్లో ఒక సినిమా తీయాలంటే తక్కువలో తక్కువ 70 నుంచి 90 రోజులు పడుతుంది. అది అత్యంత తక్కువ వర్కింగ్ డేస్ అని చెప్పొచ్చు. కానీ ఒకానొక సమయంలో కేవలం 15 రోజుల్లోనే ఒక సినిమా తీసి రిలీజ్ చేస్తే, అది తెలుగులో ఏడాది ఆడడమే కాదు, కన్నడ, మరాఠీ భాషల్లో సైతం రీమేక్ అయింది. ఆ సినిమా మరేమిటో కాదు, రాజేంద్రప్రసాద్ హీరోగా, దివ్యవాణి హీరోయిన్గా నటించిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం. Also…
Gaddar Awards: తెలుగు చిత్రసీమలో మరోసారి సినీ అవార్డులతో వేదిక వెలుగులు నింపనుంది. 14 సంవత్సరాల విరామం తర్వాత ఉత్తమ తెలుగు సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలివ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ అవార్డులను ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గద్దర్ గారి పేరుతో ఇవ్వాలని ప్రభుత్వం ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం ఒక మహత్తరమైన గౌరవంగా భావిస్తున్నారు తెలంగాణ సినీ ప్రేమికులు. ఈ అవార్డుల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రముఖ సినీ నటి జయసుధ నేతృత్వంలో…
జనసేన పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తూగో జిల్లా సినీ డిస్ట్రిబ్యూటర్, అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ రాజమండ్రిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, ఇదంతా దిల్ రాజు కుట్రలో భాగమని ఆరోపించారు. సినిమా థియేటర్ల బంద్ విషయంలో తన పేరును దురుద్దేశంతో లాగారని, ఈ వివాదం వెనుక దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్ రెడ్డి, సురేష్…
సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనే అంశం పై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానని దిల్ రాజు అన్నారు. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఆయన సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న పవన్ అభిప్రాయం అభినందనీయం. దీనిని మనమందరం స్వాగతించి, కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని అన్నారు. Also Read: Manchu Brothers: కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్…
తెలుగు చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల నేపథ్యం, ఆ నలుగురు ప్రమేయం, తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లాలో తొలుత బంద్ ప్రకటన వెలువడిన క్రమం తదితర అంశాల మీద ఏపీ డిప్యూటీ సీఎం అధికారులతో చర్చించారు. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన…
తెలుగు నాట సినీ పరిశ్రమను, రాజకీయాలను వేరువేరుగా చూడటం కష్టం. ఆ లింకులన్నీ అలా సింక్ అయి ఉంటాయి మరి. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందట. తమకు ఆర్ధిక సమస్యలు ఉన్నాయంటూ... సినీ ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ముందు ప్రకటించి తర్వాత అది వివాదాస్పదం కావడంతో.... ఉపసంహరించుకున్నారు. ఎగ్జిబిటర్ల ఉద్దేశ్యం ఏదైనా... దాని మీద భిన్న వాదనలున్నా.... బంద్ ప్రకటనతో పవన్కళ్యాణ్కు మాత్రం కాలిపోయిందట. తన సినిమా…
తెలుగు సినిమా ఇండస్ట్రీ (టాలీవుడ్) రేంజ్ రోజురోజుకీ మారిపోతోంది. భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తమిళ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కథ మీద దృష్టి పెట్టకుండా, మంచి రెమ్యునరేషన్ ఇస్తే చాలు.. డేట్స్ ఇచ్చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో తమిళ స్టార్స్ టాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. Also Read:Allu Arjun : అట్లీ మూవీలో యానిమేటెడ్ రోల్ చేస్తున్న బన్నీ..?…
తెలుగు చిత్ర పరిశ్రమలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేతకు సంబంధించిన కీలక నిర్ణయం జూన్ 1, 2025 నుంచి అమలులోకి రావాల్సి ఉండగా, తాజా చర్చల తర్వాత ఈ నిర్ణయం వాయిదా పడింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మే 21, 2025న హైదరాబాద్లో జరిగిన సమావేశాలు ఈ విషయంలో కీలక పరిణామంగా నిలిచాయి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య జరిగిన వాడివేడి చర్చలు పరిశ్రమలో సామరస్యాన్ని కాపాడే దిశగా ఒక అడుగు ముందుకు వేశాయి. మే…
తెలుగు చిత్ర పరిశ్రమలో సింగిల్ థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు సంబంధించి రెంట్ (అద్దె) విధానం, పర్సంటేజ్ (షేరింగ్) విధానంపై ఎగ్జిబిటర్లు – నిర్మాతల మధ్య మొదలైన వివాదం అనేక మలుపులు తిరుగుతూ వెళ్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ప్రస్తుతం రెంటల్ విధానంపై ఎక్కువగా నడుస్తున్నాయి. ఈ విధానంలో నిర్మాతలు థియేటర్లకు నిర్ణీత అద్దె చెల్లించి సినిమాలను ప్రదర్శిస్తారు. అయితే, కలెక్షన్లు తక్కువగా ఉన్నప్పుడు థియేటర్లు షోలను రద్దు చేయడం లేదా మూసివేయడం వంటి…