అమరావతి: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. గుడివాడ ఆర్ఐపై మట్టి మాఫియా ఎదురు కేసు పెట్టడంపై లేఖలో వర్ల రామయ్య అభ్యంతరం తెలిపారు. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారిపైనే కేసు పెట్టారంటే మట్టి మాఫియా ఎంత శక్తివంతంగా ఉందో తెలుస్తోందని వర్ల రామయ్య ఆరోపించారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడి రెవెన్యూ అధికారిపై దాడి చేసిన మాఫియాను అరెస్టు చేయకుండా బాధితుడైన ఆర్ఐపై కేసు నమోదు చేయడం…
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి టీడీపీ ఆర్ధిక సహాయం అందించింది. ఈ మేరకు టీడీపీ నేతలు బోండా ఉమ, వంగలపూడి అనిత బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా వ్యాఖ్యలకు బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు. రోజా సొల్లు మాటలు చెప్పడం మానుకోవాలని.. జగన్ ప్రభుత్వ హయాంలో 800 మంది మహిళలపై దాడులు జరిగితే ఏం చేశారని ప్రశ్నించారు. బ్లూఫిల్మ్‌లలో పాల్గొన్నట్టు స్వయంగా రోజా మీదే అభియోగాలు…
చెన్నై ఆస్తి విషయంలో కేంద్ర మాజీ మంత్రి, మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుకు ఏపీ హైకోర్టులో మంగళవారం నాడు ఊరట లభించింది. చెన్నై మైలాపూర్‌లోని 37,902 చదరపు అడుగుల భూమికి సంబంధించిన దస్త్రాలను తీసుకుని స్వయంగా హాజరుకావాలంటూ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన నోటీసులను హైకోర్టు నిలిపివేసింది. ఏ వివరాల ఆధారంగా అశోక్‌గజపతిరాజు, ఆయన సోదరి రాజా వాసిరెడ్డి సునీత ప్రసాద్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేశారని ఈడీని హైకోర్టు ప్రశ్నించింది. ఈ…
టీడీపీ అధినేత చంద్రబాబుపై హోంమంత్రి తానేటి వనిత విమర్శలు చేశారు. టీడీపీకి మహిళలపై గౌరవం లేదన్నారు. అత్యాచార బాధితురాలి పరామర్శను చంద్రబాబు రాజకీయం చేశారని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన మూడు గంటల్లో నిందితులను పట్టుకున్నామని, బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇచ్చామని హోంమంత్రి తానేటి వనిత గుర్తుచేశారు. మహిళలకు ఏదో జరిగిపోతుందని టీడీపీ నేతలు తెగ ఆరోపణలు చేస్తున్నారని.. తనను ట్రోల్ చేయడం టీడీపీ నేతలు మహిళలకు ఇచ్చే గౌరవమా అని ప్రశ్నించారు. మహిళా కమిషన్…
అమరావతి: టీడీపీ గ్రామ కమిటీలతో మంగళవారం సాయంత్రం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదుపై సమీక్ష జరిపారు. జగన్ పన్నుల పాలనను చాటి చెప్పేలా బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. ఏపీ పరిస్థితిపై ఆర్థిక వేత్తల ఆందోళన రాష్ట్ర పరిస్థితికి దర్పణమని తెలిపారు. ఇప్పటివరకు 163 నియోజకవర్గాల్లోని 3 వేలకుపైగా గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. మరోవైపు భారీ ఎత్తున మెంబర్ షిప్ చేయడంలో…
తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై ఎన్టీవీతో మంత్రి రోజా స్పందించారు. రుయాసంఘటన దురదృష్టకరమని అభిప్రాయపడ్డ ఆమె.. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డెడ్ బాడీకి ఇవ్వాల్సిన మహాప్రస్థానం వాహనం ఇవ్వలేదని తెలిసిందని.. ఇది సూపరింటెండెంట్, సీఎస్‌ఆర్‌ఎంవో బాధ్యత అని.. కానీ ఎలా మిస్ అయిందో తెలియదన్నారు. ఈ ఘటనపై వెంటనే జిల్లా అధికారులను పంపించి నివేదిక ఇవ్వమని చెప్పినట్లు మంత్రి రోజా వివరించారు. ఇప్పటికే ఈ ఘటనలో సీఎస్‌ఆర్‌ఎంవోను సస్పెండ్ చేశామని.. ఆస్పత్రి…
వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ్‌రెడ్డిపై నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జి మాండ్ర శివానందరెడ్డి పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నందికొట్కూరు నియెజకవర్గం ఎక్కడ అభివృద్ధి చెందిందో చెప్పాలని వైసీపీ నాయకులు చెప్పాలని మాండ్ర శివానందరెడ్డి డిమాండ్ చేశారు. రియల్టర్ల దగ్గర కమిషన్లు తీసుకోవడం తప్ప జరిగిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. నందికొట్కూరులో వైసీపీ రాక్షస పాలన సాగుతోందని.. డాక్టర్‌పై దాడి ఘటనే అందుకు ఉదాహరణ అని మాండ్ర శివానందరెడ్డి విమర్శలు చేశారు. టీడీపీలో చేరాలని ఎవరెవరి కాళ్లు…
అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్షించి పర్యటనలపై నేతలతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరుపైనా చంద్రబాబు చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం తన అసమర్ధతకు బలి చేసిందని ఆరోపించారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే మూడేళ్లు జగన్ ప్రభుత్వం ఎందుకు దాచి పెట్టిందని నిలదీశారు. పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టినా.. మూర్ఖంగా ముందుకు వెళ్లి…
ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన గ్రామ సభలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తనకు మాట్లాడే అవకాశం కల్పించాలంటూ గ్రామ సభకు వచ్చిన వైసీపీ ఎంపీటీసీ కాజా రాంబాబు విజ్ఞప్తి చేశారు. తాను వైసీపీలోనే ఉంటూ గ్రామంలో జరిగిన రూ.75 లక్షల అవినీతిపై పోరాడుతున్నట్లు రాంబాబు చెప్పడంతో చంద్రబాబు ఆయనకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకా ప్రతాప్ తనయుడు అవినీతికి పాల్పడ్డాడంటూ చంద్రబాబుకు…
అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై చెత్తవాగుడు వాగేవారిని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు కోసం 100 మందితో సూసైడ్ బ్యాచ్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎవరైనా అనవసరంగా నోరు పారేసుకుంటే చంపడానికైనా, చావడానికైనా సూసైడ్ బ్యాచ్ సిద్ధంగా ఉందని తెలిపారు. వచ్చే రెండేళ్ల పాటు చంద్రబాబు కుటుంబంపై పిచ్చి వేషాలు చేసే వైసీపీ బ్యాచ్…