టీడీపీ అధినేత చంద్రబాబుపై హోంమంత్రి తానేటి వనిత విమర్శలు చేశారు. టీడీపీకి మహిళలపై గౌరవం లేదన్నారు. అత్యాచార బాధితురాలి పరామర్శను చంద్రబాబు రాజకీయం చేశారని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన మూడు గంటల్లో నిందితులను పట్టుకున్నామని, బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇచ్చామని హోంమంత్రి తానేటి వనిత గుర్తుచేశారు. మహిళలకు ఏదో జరిగిపోతుందని టీడీపీ నేతలు తెగ ఆరోపణలు చేస్తున్నారని.. తనను ట్రోల్ చేయడం టీడీపీ నేతలు మహిళలకు ఇచ్చే గౌరవమా అని ప్రశ్నించారు.
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌తో టీడీపీ మహిళలు కుళాయి దగ్గర కొట్లాటలా వ్యవహరించారని హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు. ఆనాడు వనజాక్షిని కొడితే నాటి సీఎం చంద్రబాబు పంచాయతీ చేశారని.. మహిళలు సీఎం జగన్‌కు అండగా ఉన్నారని టీడీపీ నేతలు ఫస్ట్రేషన్‌కు గురవుతున్నారని విమర్శించారు. ప్రతి అవకాశాన్ని టీడీపీ వాళ్లు రాజకీయం చేస్తున్నారని తానేటి వనిత మండిపడ్డారు. గత ప్రభుత్వంలో మహిళలపై దారుణాలు జరిగితే బయటకు వచ్చేవి కాదన్నారు. తమ ప్రభుత్వంపై నమ్మకంతో బాధితులు బయటకు వస్తున్నారని.. అందుకే తమ ప్రభుత్వంలో అత్యాచార కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని వివరించారు. దిశ యాప్ ద్వారా ఇప్పటివరకు 900 మంది మహిళలు తమను తాము రక్షించుకున్నారని తెలిపారు. హక్కుల కోసం పోరాడటాన్ని సీఎం జగన్ హర్షిస్తారని.. కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యూటీఎఫ్ యత్నించడం సరైందేనా అని ఆమె ప్రశ్నించారు.
Minister Roja: టీడీపీ నేతలు ఉన్మాదులు.. మా గురించే మాట్లాడే నైతిక హక్కు లేదు