Chandrababu: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా తెనాలికి చెందిన వైసీపీ నేత గుదిబండ గోవర్ధన్‌రెడ్డి తన అనుచరులతో పాటు టీడీపీలో చేరారు. దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి సోదరుడి కుమారుడే గోవర్ధన్ రెడ్డి. పదేళ్ల పాటు వైసీపీలో కొనసాగిన ఆయన తాజాగా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. జగన్ మళ్లీ సీఎం…
Pattabhi: ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై ఇంకా రచ్చ జరుగుతూనే ఉంది. ఈ వీడియోపై ఇటీవల టీడీపీ ఇచ్చిన నివేదిక వాస్తవం కాదని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ స్వయంగా ప్రకటించడం మరింత చర్చకు దారి తీసింది. దీంతో టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. గోరంట్ల మాధవ్ నగ్న వీడియోలో ఎడిటింగ్ లేదని జిమ్ స్టాఫోర్డ్ ఇచ్చిన నివేదిక వాస్తవమని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి స్పష్టం చేశారు. ఈ అంశంలో త్వరలోనే మరిన్ని…
Nara Lokesh: ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఎనర్జీ అసిస్టెంట్లు, జేఎల్‌ఎం గ్రేడ్-2 ఉద్యోగుల సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు. ఎనర్జీ అసిస్టెంట్ల న్యాయమైన డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జాబ్ ఛార్ట్‌ని విస్మరించి కట్టుబానిసల్లా వాడుకోవడంతో ఎనర్జీ అసిస్టెంట్లు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారని లోకేష్ ఆరోపించారు. సెలవులు, పండగలు, పబ్బాల ఊసే లేకుండా చేశారని.. దీంతో రాత్రి,…
Nara Lokesh: విజయవాడలో చిరు వ్యాపారులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సీఎం అయిన దగ్గర నుంచి చిరు వ్యాపారులను కూడా వదలకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు. కరోనాను ఎదుర్కొన్నాం కానీ.. జగన్ వైరస్‌ను ఎదుర్కోలేకపోతున్నామని లోకేష్ చురకలు అంటించారు. ఏపీలో జగన్, అతని చుట్టుపక్కల ఉన్న నలుగురిదే రాజ్యం…