Visakha South TDP : పెళ్ళికి వెళ్తే తప్పా? విశాఖ సౌత్ టీడీపీలో కొత్త సెగలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిలవని పేరంటానికి వెళ్లరు సరే.. పిలిచిన పెళ్లికి వెళ్లడం కూడా తప్పేనా..? విశాఖ సౌత్ టీడీపీలో రచ్చ రచ్చ అవుతున్న ఎపిసోడ్ ఇదే..! కేడర్ వర్సెస్ లీడర్ అన్నట్టుగా మారిపోయింది వార్. నిలదీతలు.. ప్రశ్నలు.. సవాళ్లు.. పరిస్థితిని వేడెక్కిస్తున్నాయి. ఎందుకలా? లెట్స్‌వాచ్..!
ఉత్తరాంధ్రలో రాజకీయాల వేడి ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తుంది. దానికి భిన్నంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీలో కొత్త పోకడలు సెగలు రేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంట్లో పెళ్లి వేడుక దానికి కారణం కావడం మరింత చర్చగా మారింది. ఇటీవల ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడి వివాహ రిసెప్షన్ జరిగింది. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వధూవరులను ఆశీర్వదించారు. ఇదే ఫంక్షన్‌కు వెళ్లిన దక్షిణ నియోజకవర్గ టీడీపీ లీడర్లు, కేడర్ రాజకీయ కారణాలతో అడకత్తెరలో పడ్డారు.
Also Read
ఎమ్మెల్యే వాసుపల్లి రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచారు. ప్రస్తుతం వైసీపీకి జైకొట్టారు. దాంతో నియోజకవర్గంలోని కేడర్‌ను కాపాడుకునేందుకు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి పార్టీ ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించింది టీడీపీ. వాసుపల్లి ఇంట పెళ్లి వేడుక్కి వెళ్లొద్దని గండి బాబ్జి.. సౌత్ టీడీపీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. వెళ్లినవాళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. ఈ ఆదేశాలు పార్టీ అంతర్గత గ్రూపుల్లో చర్చకు దారి తీశాయి. 15 ఏళ్లపాటు ఒకేపార్టీలో కలిసి పనిచేసిన నాయకుడి ఇంట్లో పెళ్లికి వెళ్లొద్దనడంపై కొందరు ప్రశ్నలు లేవనెత్తారు. వాసుపల్లితో బంధుత్వం ఉన్నవాళ్లూ టీడీపీ నాయకులుగా ఉన్నా రు. పార్టీ కోసం త్యాగాలు చేస్తాం కానీ.. బంధుత్వాలను, స్నేహాలను వదులుకోమంటే సాధ్యం కాదని కొందరు గండి బాబ్జీ ముందే వాళ్లు కుండబద్దలు కొట్టేశారట. చాలా మంది ఇంఛార్జ్ ఆదేశాలను లెక్క చేయలేదు.
ఇంఛార్జ్ హోదాలో బాబ్జీ చర్యలు తీసేసుకున్నారు. ఒక మహిళా నాయకురాలిని పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించడంతో ఆమె నేరుగా పార్టీ ముఖ్యులకు ఫిర్యాదు చేశారట. టీడీపీలో కొత్తగా ఈ షరతులేంటి అని ఆమె ప్రశ్నించారట. ఈ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ ఉంది. విశాఖ సౌత్ లీడర్లే కాకుండా.. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన చాలామంది టీడీపీ సీనియర్ నాయకులు వాసుపల్లి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. దాంతో మమ్మల్ని వెళ్లకుండా నియంత్రించాలని అనుకున్న బాబ్జీ.. సీనియర్ లీడర్లకు ఎందుకు బ్రేకులు వేయలేదని గట్టిగా నిలదీస్తున్నారట. రాజకీయాల్లో దూకుడు అవసరమైనా.. ఈ తరహా స్పీడ్ ప్రదర్శిస్తే పార్టీలో కొనసాగడం కష్టమని టీడీపీ పెద్దలకు చెప్పాలనే ఆలోచనలో ఉన్నారట నాయకులు. ప్రస్తుతం దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యే వాసుపల్లి, గండి బాబ్జీ ఇద్దరు ప్రజలకు దగ్గరయ్యేందుకు పోటీ పడుతున్నారు. ఇలాంటి తరుణంలో అనవసరమైన వ్యవహారాలను టీడీపీ ఇంఛార్జ్ నెత్తిన పెట్టుకుంటే నష్టం తప్ప ఫలితం ఉండదని పెదవి విరుస్తున్నారట సీనియర్లు.
తాజావార్తలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
-
Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!