What’s Today: • ఏపీ, తెలంగాణలో నేడు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక • తిరుమల: నేడు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు టీటీడీ ఆధ్వర్యంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం • ప్రకాశం: మార్కాపురం ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ నేడు ప్రారంభోత్సవం.. హాజరుకానున్న మంత్రులు విడదల రజినీ, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని…
* కర్ణాటకలో కొనసాగుతోన్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ * నేడు హైదరాబాద్‌కు మల్లికార్జున ఖర్గే.. ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో పార్టీ నేతలతో సమావేశం * ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై నేడు రౌండ్ టేబుల్ సమావేశం.. నిపుణుల అభిప్రాయాలు సేకరించనున్న ఐక్య కార్యాచరణ కమిటీ * తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. గోగర్బం డ్యాం వరకు క్యూ లైనులో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం * విశాఖ: వికేంద్రీకరణ…
దాదాపు 75 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కల్వకుర్తి, కడప వాసులుగా గుర్తించారు.
రాహుల్ గాంధీ అతి ధైర్యం, పట్టుదలతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. రెండుసార్లు ప్రధానిగా అవకాశం వచ్చినా ఆర్థికవేత్తకు అవకాశం ఇచ్చారని రాహుల్‌ను వీహెచ్ కొనియాడారు.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో రెండు ఆలయాల్లో దుండగులు చొరబడటం కలకలం రేపింది. ఊరిలో కొలువైన వేణుగోపాలస్వామి ఆలయంలో 500 ఏళ్ల నాటి 20కిలోల ఆండాళమ్మ పంచలోహ విగ్రహం చోరీకి గురైంది.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండురోజుల పాటు మళ్ళీ వారణుడు తన ప్రతాపాన్ని చూపనున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ కీలక సమావేశం జరగనుంది… ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా జరగనున్న ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు.. ఉన్నతాధికారులు హాజరుకాబోతున్నారు.. వారితో కేంద్రం ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది… ఈ సమావేశానికి కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ (డీడీఆర్పీ) అధికారులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా హాజరవుతారని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది… ఆయా రాష్ట్రాల నీటిపారుదల…
* ఉమెన్స్ ఆసియాకప్‌లో నేడు కీలక పోరు.. బంగ్లాదేశ్‌లోని సైల్హట్ వేదికగా తలపడనున్న భారత్-పాక్.. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానున్న మ్యాచ్ * నేడే మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. ఈ నెల 14 వరకు నామినేషన్ల స్వీకరణ * పోలవరంపై నేడు కీలక సమావేశం.. ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా భేటీకానున్న తెలుగు రాష్ట్రాల అధికారులు.. పోలవరం నిర్మాణం, రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చ * నేడు…