What’s Today:
• ఏపీ, తెలంగాణలో నేడు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
• తిరుమల: నేడు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు టీటీడీ ఆధ్వర్యంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం
• ప్రకాశం: మార్కాపురం ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ నేడు ప్రారంభోత్సవం.. హాజరుకానున్న మంత్రులు విడదల రజినీ, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని
• విశాఖ: నేడు, రేపు అఖిల భారత స్థాయి విద్యుత్ ఉద్యోగుల కౌన్సిల్ సమావేశాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యుత్ సంస్కరణలపై చర్చ
• అల్లూరి సీతారామరాజు జిల్లా: నేడు పాడేరులో రౌండ్ టేబుల్ సమావేశం.. పరిపాలన వికేంద్రీకరణ, విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌పై చర్చ
• కొమురం భీం: నేడు కొమురం భీం 82వ వర్ధంతి.. జోడేన్ ఘాట్‌లో కొమురం భీం వర్ధంతి వేడుకల్లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
• పశ్చిమ గోదావరి: నేడు ద్వారకతిరుమల చిన్నవెంకన్న కళ్యాణోత్సవం.. మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీవారు
• నేడు తెలంగాణ రానున్న కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్.. చౌటుప్పల్‌లో యాదవ సంఘం నేతలతో సమావేశం కానున్న భూపేంద్ర యాదవ్
• నేడు మునుగోడులో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం
• రాంచీ: నేడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే.. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం