తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు కొంత కాలంగా ఎదురుచూస్తోన్న మునుగోడు ఉప ఎన్నికకు సమయం రానే వచ్చింది. రేపటి నుంచి మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్లు షురూ కానున్నాయి. అయితే..టీఆర్ఎస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించక పోవడం చర్చకు దారితీస్తోంది.
మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీకు శుభవార్త… ఇవాళ్టి నుంచి ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేస్తున్నారు.. తెలంగాణలో ఇవాళ నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించారు… డిసెంబర్ వరకూ 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని అందించనుంది ప్రభుత్వం.. రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం ఇచ్చే బియ్యానికి అదనంగా మరో ఐదు కిలోలు కలిపి మొత్తం ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తామని…
దేశ రాజకీయాల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ ఏకగ్రీవం తీర్మానం చేసిన విషయం తెలసిందే.. ఇక, ఈ తీర్మానం కాపీని ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అందజేశారు బీఆర్ఎస్ నేతలు… తెలంగాణ సీఎం ఇప్పటికే అనేకమార్లు ఢిల్లీలో పర్యటించిన కేసీఆర్.. ఇప్పుడు మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. త్వరలోనే కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తారని తెలుస్తోంది..…
దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. విజయదశమి రోజున ముహూర్తం పెట్టి మరీ పార్టీ పేరును మార్చారు.. తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరిగింది.. టీఆర్ఎస్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.. ఇవాళ బీఆర్ఎస్ నేతలు.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి.. ఈ మేరకు సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరు మార్పుపై ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని అందజేయనున్నారు.. రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్పై చర్చ…
* నేడు భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే.. లక్నోలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ * నేటి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభం.. రెండు రోజుల విరామం తర్వాత ప్రారంభంకానున్న యాత్ర * నేడు సీఈసీని కలవనున్న టీఆర్ఎస్ నేతల బృందం.. ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్కు ఈసీ అపాయింట్మెంట్… బీఆర్ఎస్ పేరు తీర్మానాన్ని ఈసీకి ఇవ్వనున్న నేతలు * నేడు రాజమండ్రిలో అమరావతి పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం..…
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్).. ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్)గా మారిపోయింది… తెలంగాణ భవన్ వేదికగా జరిగిన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో.. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టడం.. ప్రతినిధులు దానికి ఆమోదం తెలపడం జరిగిపోయాయి.. ఇక, ఈ సందర్భంగా చేసిన తీర్మానాన్ని.. సమావేశం చివరల్లో చదివి వినిపించారు గులాబీ పార్టీ చీఫ్ కె.చంద్రశేఖర్ రావు.. భారత్ రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అక్టోబర్ 5వ తేదీ 2022న…
తెలంగాణ గడ్డపై నవ శకం మొదలైంది… తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీగా మారిపోయింది… జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన గులాబీ దళపతి కె.చంద్రశేఖర్‌రావు.. దానికి ఆమోదం పొందేలా చేశారు.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఆమోదం తెలిపింది.. దీంతో.. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారిపోయింది… టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మారుస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు సీఎం కేసీఆర్……