టీఆర్ఎస్ కాస్తా ఇప్పుడు బీఆర్ఎస్గా మారబోతోంది.. కొత్త పార్టీకి విజయ దశమిని ముహూర్తంగా ఎంచుకున్నారు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్.. అయితే, విజయ దశమి సందర్భాన్ని గుర్తు చేస్తూ.. బీఆర్ఎస్ అవిర్భావానికి లింక్ పెడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి… ఆనాడు కౌరవులపై పాండవులు విజయం సాధించారు.. ఇవాళ కూడా కౌరవుల లాంటి బీజేపీ నాయకులపై తమ పార్టీ అధినేత కేసీఆర్ విజయం సాధిస్తారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో…
తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందుతుంది.. గులాబీ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది.. అయితే, బీఆర్ఎస్ గుజరాత్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ పోటీచేసిన చోట కూడా మా పార్టీ పోటీ చేయబోతుందన్నారు.. కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు ఇప్పటికే సిద్ధం అవుతున్నాయి.. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రచారం మొదలు పెట్టాయి. ఎన్నికల…
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు.. కాసేపట్లో జాతీయ పార్టీని ప్రకటించబోతున్నారు.. ఇక, సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా కర్నాటక నుంచి ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ జనతాదళ్ (ఎస్) ముఖ్యనేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, తదితర ప్రజా ప్రతినిధుల బృందం ప్రగతిభవన్‌కు వచ్చింది.. వీరికి ఆహ్వానం పలికారు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు.. అదే సందర్భంగా., తమిళ నాడు నుంచి…
టీఆర్ఎస్ పార్టీని స్థాపించి.. సాధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు.. దాని కోసం.. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు, ఇప్పటికే వాడుతున్న గులాబీ రంగులను కొనసాగిస్తూ.. పార్టీ పేరును మాత్రం మార్రచేస్తున్నారు.. అనేక పేర్లు పరిశీలించిన చివరకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు ఆయన మెగ్గు చూపినట్టు తెలుస్తోంది.. తెలంగాణ గడ్డపై ఆవిర్భవిస్తోన్న ఆ కొత్త పార్టీకి సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం
తెలంగాణ గడ్డ నుంచి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న కేసీఆర్.. పార్టీని వీడిన నేతలకు మళ్లీ గులాబీ కండువాలు కప్పే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు.. అదే ఇప్పుడు కేసీఆర్ ఫాలో అవుతున్నారేమో అనిపిస్తోంది.. ఎందుకంటే.. ఈ మధ్యే అంటే.. మే నెలలోనే టీఆర్ఎస్ను వీడిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు.. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సమక్షంలో హస్తం పార్టీ గూటికి చేరారు.. అయితే.. కాంగ్రెస్‌లో వారి జర్నీ మూడు…
తెలంగాణ గడ్డపై మరో కొత్త ఆవిర్భవించనుంది.. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన గులాబీ పార్టీ.. ఇప్పుడు జాతీయస్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతోంది.. టీఆర్ఎస్ను కాస్తా బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా మారుస్తూ ఇవాళ తీర్మానం చేయబోతున్నారు.. జాతీయ పార్టీకి ఏ పేరు పెట్టాలన్న దానిపై కొన్ని పేర్లను పరిశీలించిన తర్వాత చివరకు బీఆర్ఎస్కే గులాబీ దళపతి మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.. మొత్తంగా ఇవాళ తెలంగాణ గడ్డపై కొత్త పార్టీ పురుడు…
What’s Today: • ఢిల్లీ: నేడు రాంలీలా మైదానంలో రావణ దహనం కార్యక్రమం.. హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, హీరో ప్రభాస్.. ఆదిపురుష్ సినిమాలో రాముడిగా నటించిన ప్రభాస్.. కోవిడ్‌తో రెండేళ్లుగా రావణ దహనం నిర్వహించని రాంలీలా కమిటీ • హైదరాబాద్: ఈరోజు ఉ.11 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం.. 283 మంది ప్రతినిధులకు ఆహ్వానం.. సమావేశంలో టీఆర్ఎస్ పేరు మార్పు తీర్మానంపై సంతకాల సేకరణ.. ఈ భేటీ తర్వాత…
Talasani Srinivas Yadav: గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న గోపాలమిత్రలకు దసరాకు ఒకరోజు ముందే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీపికబురు అందించారు. ప్రస్తుతం గోపాల మిత్రలకు నెలకు రూ.8,500 చెల్లిస్తుండగా.. 30శాతం జీతం పెంచనున్నట్లు మంత్రి తలసాని ప్రకటించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగా 30 శాతం అంటే రూ.2,550 పెంచి మొత్తం రూ.11,050 ఇస్తామని తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడమే కాకుండా…