ఎర్రచందనం స్మగ్లింగ్‌ను కళ్లకు కట్టినట్టు ‘పుష్ప’ సినిమాలో చూపించారు.. పాల వ్యాన్, ఇతర మార్గాల్లో ఎలా ఎర్రచందనాన్ని సైడ్ చేయొచ్చో తెరపైకి ఎక్కించారు.. ఆ తర్వాత ఈ తరహా స్మగ్లింగ్లు ఎన్నో వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు తాజాగా డ్రగ్స్ స్మగ్లింగ్ బయటపడింది.. కొత్త తరహాలో డ్రగ్స్ రవాణా చేస్తున్నారు కేటుగాళ్లు.. పెళ్లి బృందం ముసుగులో డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠా రాచకొండ పోలీసులకు చిక్కింది.. చెన్నైకి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.. 15 కిలోల మత్తు…
ఎస్టీ రిజర్వేషన్లపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేం.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఆ దిశగా నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా… పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు.. తెలంగాణలో 10 శాతం బీసీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలిపారా? అంటూ లోక్‌సభలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎంపీలు రంజిత్ రెడ్డి, కవిత మాలోతు.. కేంద్రాన్ని ప్రశ్నించారు.. షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)కి 10 శాతానికి పెంచిన…
Varahi: పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి సంబంధించి మరో ట్విస్ట్ నెలకొంది. ఈ వాహనం రిజిస్ట్రేషన్ వాయిదా పడిందని వార్తలు వచ్చి కొద్దిగంటలు కూడా ముగియకముందే వారాహి రిజిస్ట్రేషన్ ఎప్పుడో పూర్తయిందని తెలంగాణ రవాణా శాఖ వెల్లడించింది. దీంతో జనసేన పార్టీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారాహికి లైన్ క్లియర్ అయిందని.. ఈ వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయని.. వారం కిందటే రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని స్వయంగా తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు.…
Ex Mp Ponnam Prabhakar: సింగరేణి బొగ్గు.. తెలంగాణ హక్కు అన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో నాలుగు బొగ్గు గనులను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందని టీఆర్ఎస్ ఆరోపిస్తోందని అన్నారు. వాస్తవంగా సింగరేణి లో ఏ నిర్ణయం తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం ఉండాలని తెలిపారు. తాడిచెర్ల గనుల ప్రైవేటీకరణను రద్దు చేసి సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. తాడిచెర్ల బొగ్గు గనులను జెన్కో ద్వారా ఏఎంఆర్ కంపెనీకి కట్టబెట్టారు. AMR కంపెనీకి…
సీఎం కేసీఆర్ తెలంగాణలో లేకుంటే చెట్లు లేక పర్యావరణం దెబ్బతినేదని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఒక లక్ష మొక్కల మెగా ప్లాంటేషన్ లో భాగంగా నల్లగొండ జిల్లాలోని దేవరకొండ రోడ్డులో మంత్రి జగదీష్ రెడ్డి మొక్కలు నాటారు.
ముగిసిన ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాదులోని కవిత నివాసంలో కొద్దిసేపటి కిందట విచారణ ముగిసింది. ఈ ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను ప్రశ్నించిన సీబీఐ బృందం ఆమె నుంచి వివరాలు సేకరించింది. లిక్కర్ స్కాంలో సాక్షిగా కవిత వాంగ్మూలం నమోదు చేసింది. నేటి విచారణలో ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం పాల్గొంది. లిక్కర్…
రేపు ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్.. ఈనెల 14న బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు(సోమవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 14న బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆయన రేపు రాజధానికి పయనం కానున్నారు. ఢిల్లీలో డిసెంబర్ 14న ఎస్పీ రోడ్ లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారభించనున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని , జాతీయ కార్యవర్గాన్ని అదే రోజు ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందుగానే మంత్రి నిరంజన్ రెడ్డి,…