Ex Mp Ponnam Prabhakar: సింగరేణి బొగ్గు.. తెలంగాణ హక్కు అన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో నాలుగు బొగ్గు గనులను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందని టీఆర్ఎస్ ఆరోపిస్తోందని అన్నారు. వాస్తవంగా సింగరేణి లో ఏ నిర్ణయం తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం ఉండాలని తెలిపారు. తాడిచెర్ల గనుల ప్రైవేటీకరణను రద్దు చేసి సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. తాడిచెర్ల బొగ్గు గనులను జెన్కో ద్వారా ఏఎంఆర్ కంపెనీకి కట్టబెట్టారు. AMR కంపెనీకి గుట్టు చప్పుడు కాకుండా 30 ఏళ్ల కాలం పాటు అప్పజెప్పారని తెలిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉంది. వేలకోట్ల కుంభకోణం ఇది అని ఆరోపించారు. ఇందులో అవినీతి జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. మరి 49 శాతం వాటా ఉన్న కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటోందని ఆగ్రమం వ్యక్తం చేశారు.
Read also: Unstoppable: మీరు ఎన్నడూ చూడని ఎంటర్టైన్మెంట్ రెడీ అవుతోంది…
ఈ అంశంపై సీబీఐ, ఈడీకి, బొగ్గు మంత్రిత్వ శాఖకు లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తున్నానని తెలిపారు. 20 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే చెప్పారని తెలిపారు. కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ బొగ్గు గనుల కేటాయింపు పై దర్యాప్తు సంస్థలతో విచారణకు అదేశించాలని కోరారు. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు ప్రైవేటీకరణ వద్దన్న వాళ్లు ఇప్పుడు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాడిచెర్ల గనుల కేటాయింపు ను రద్దు చేయాలి కేంద్రంకు ఆ అధికారం ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అవినీతి గురించి పొద్దున లేస్తే మాట్లాడే బీజేపీ.. బొగ్గుగనుల కేటాయింపులో అవినీతి పై కమలం నేతలు ఎందుకు చర్యలు తీసుకోరు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే అని ఈ ఉదంతంతో మరోసారి రుజువయ్యిందని తెలిపారు. ప్రకృతి వనరులను దోచుకుంటుంటే చూస్తూ ఉరుకోమని, కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. సింగరేణి బొగ్గు.. తెలంగాణ హక్కు అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Crime News: డామిట్ కథ అడ్డం తిరిగింది.. మ్యాట్రిమోని మోసగాడి తిక్క కుదిరింది