Minister Jagdish Reddy: సీఎం కేసీఆర్ తెలంగాణలో లేకుంటే చెట్లు లేక పర్యావరణం దెబ్బతినేదని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఒక లక్ష మొక్కల మెగా ప్లాంటేషన్ లో భాగంగా నల్లగొండ జిల్లాలోని దేవరకొండ రోడ్డులో మంత్రి జగదీష్ రెడ్డి మొక్కలు నాటారు. కొన్ని దేశాల్లో ఆక్సిజన్ కొనుక్కుంటున్నారని అన్నారు. భారత దేశంలోనూ ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితులున్నాయని తెలిపారు. ప్రస్తుతం మంచి నీళ్లు కొనుక్కుని తాగుతున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో లేకుంటే చెట్లు లేక పర్యావరణం దెబ్బతినేదని మంత్రి తెలిపారు.
Read also: Bandi Sanjay: యాగం చేస్తే ఇంట్లో చేసుకోవాలి ఢిల్లీలో కాదు..
100 శాతం ఆక్సిజన్ పీల్చు కోవాలంటే ప్రతీ మనిషి ఆరు మొక్కలు నాటాలని అన్నారు. కొన్ని విదేశాల్లో మనిషికీ ఆరు వేల మొక్కలు నాటబడ్డాయన్నారు. కొన్ని దేశాల్లో మొక్కలు ఖచ్చితంగా నాటితేనే వివాహాలు, పిల్లల కోసం నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. మొక్కలు నాటి సంరక్షించుకుని భవిష్యత్ తరాలకు ఆరోగ్య కరమైన వాతావరణం ఇవ్వాలని మంత్రి కోరారు. మొత్తం నల్గొండ పట్టణంలో ఇప్పటికే 15 లక్షల పైగా మొక్కలు నాటారని తెలిపారు. ఈకార్యక్రమంలో.. సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.
Pataan: నిజం రంగు చూపిస్తున్న దీపిక పదుకొణే