* ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశం.. కల్వకుంట్ల కవిత అధ్యక్షతన జరిగే సమావేశానికి తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ బాధ్యులు, పూర్తిస్థాయి జిల్లాల కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, సీనియర్ సభ్యులకు పిలుపు
* తమిళనాడుకు కొనసాగుతున్న ఆరెంజ్ అలెర్ట్… చెన్నై సహా ఆరు జిల్లాలో పడుతున్న వర్షాలు.. కాంచీపురం, తిరువళ్ళూరు, చెన్నై,ఊత్తుకోటలో స్కూల్స్ కి సెలవు ప్రకటించిన అధికారులు
*ఇవాళ ఢిల్లీకి వెళ్ళనున్న తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాజశ్యామల యాగం నిర్వహించనున్న కేసీఆర్.
*నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పై విచారణ.. అనంతబాబుకు డిఫాల్ట్ బెయిల్ మంజూరుపై విచారణ.. బెయిల్ పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించే అవకాశం
*శబరిమలలో పెరిగిన రద్దీ.. పంబా వరకు అయ్యప్ప స్వామి దర్శనం కోసం క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు
* తెలంగాణలో మూడురోజుల పాటు వర్షాలు పడే అవకాశం.. హైదరాబాద్ లో మారిన వాతావరణం.. ఉదయం నుంచి చిరుజల్లులు
*నేడు కాకినాడలో ఆక్వా సమస్యలపై రాష్ట్ర స్థాయి సదస్సు… ఆక్వా రంగంలో ఉన్న ఒడిదుడుకులు, పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై ఆక్వా రైతుల సమావేశం
*ఈనెల 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం….బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా….తూర్పు గాలుల ప్రభావంతో చురుగ్గా ఈశాన్య రుతుపవనాలు
*శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జర్నిలిజం మౌలికసూత్రాలు – విలువలు , ప్రమాణాలు అంశంపై సదస్సు… హాజరుకానున్న ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు …స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు , సీదిరి అప్పలరాజు
*విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజ్ లో అదనంగా 130 పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు…ఏ.ఎం.సి.ప్రతిపాదనలకు కేంద్రం అనుమతి
* ఇవ్వాళ రెండో సారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్న భూపేంద్రపటేల్.. గాంధీనగర్ హెలిప్యాడ్ మైదానం లో ప్రమాణ స్వీకార మహోత్సవం.. హైదరాబాద్ నుంచి గాంధీనగర్ చేరుకున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్.