తెలంగాణ సంచలనం రేకెత్తించిన డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఆదిభట్ల పోలీసులు.. గోవాలోని కాండోలిమ్ బీచ్ వద్ద నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. అతడిని గోవా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇక, అతని దగ్గర ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.. ఈ నెల 9న వైశాలి ఇంటిపై నవీన్‌రెడ్డి, అతని స్నేహితులు దాడికి పాల్పడ్డారు. అప్పటి నుంచి నవీన్ రెడ్డి పరారీలో ఉన్నాడు. అయితే, వైశాలికి అమెరికా పెళ్లి సంబంధం…
ఎమ్మెల్యే రేగా కాంతారావు.. మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఇద్దరిదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గమే అడ్డా. అధికారపార్టీలో ఇద్దరూ వలస నాయకులే. 2018 ఎన్నికల్లో పినపాకలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తర్వాత కారు ఎక్కేశారు రేగా కాంతారావు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు పాయం వెంకటేశ్వర్లు. అంతకుముందు జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి గులాబీ కండువా కప్పుకొన్నారు పాయం. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు.…
దేశవ్యాప్తంగా BRS కార్యకలాపాలు ప్రారంభించే దిశగా గులాబీ శిబిరంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో పార్టీ కార్యాలయం సిద్ధమైంది. ఇక జరగాల్సిన మరో ముచ్చట.. పార్టీకి కొత్త కమిటీల ప్రకటన. ఆ పనిలోనే ఉన్నారు గులాబీ దళపతి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఆలోచనలో ఉన్న సీఎం కేసీఆర్.. అందుకు తగ్గట్టుగానే పార్టీ కమిటీని వేసే పనిలో ఉన్నారు. ఆ ఫ్రేమ్‌లో పట్టేవారికే బీఆర్ఎస్ పదవులు కట్టబెడతారని సమాచారం. ఇతర రాష్ట్రాల్లో BRS విస్తరించేందుకు…
జాతీయ స్థాయిలో చక్రం తిప్పిందేకు టీఆర్ఎస్ పార్టీ పేరును కాస్తా బీఆర్ఎస్గా మార్చేశారు.. పొరుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై కూడా బీఆర్ఎస్ నేతలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.. ఏపీలో ముఖ్య నేతలపై బీఆర్ఎస్ కన్నేసిందా..? అలాంటి వారిని గుర్తించి బీఆర్ఎస్లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోందా..? అంటే విశాఖలో జరిగిన ఓ పరిణామం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. సీబీఐ మాజీ అధికారి లక్ష్మీ నారాయణతో సమావేశం అవ్వడానికి తెలంగాణ…
Nagakanya In Karimnagar District: కరీంనగర్ జిల్లాలోని ఓ యువతి వింతగా ప్రవర్తించింది. తనను నాగదేవత ఆవహించిందని.. తనకు గుడికట్టాలని అంటోంది. అంతేకాకుండా ఆమె నాగినిలా నాట్యం చేస్తోంది. తన శరీరంపై గీతలు ఏర్పడుతున్నాయని చూపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్ పూర్‌కు చెందిన యువతి కృష్ణవేణి ప్రవర్తన ఇప్పుడు గ్రామం మొత్తం చర్చనీయాంశంగా మారింది. కృష్ణవేణి డిగ్రీ వరకు చదివి ప్రైవేట్ స్కూలులో టీచరుగా పని చేస్తోంది. తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే…
దాడులు చేసినా వెనక్కి తగ్గేది లేదు తెలంగాణ జాగృతి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అయితే.. ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతికి ఇద్దరు స్ఫూర్తి ప్రదాతలు ఒకరు కేసీఆర్ మరొకరు ప్రొఫెసర్ జయశంకర్ అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. తెలంగాణలో ఉన్న యువతి యువకులు దేశం గురించి ఆలోచించాలని, దేశంలో మేధావులు మాట్లాడడం మానేశారన్నారు. రచయితలు ఎందుకోసం రాయాలి ? ఎవరి కోసం…