రేపు ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్.. ఈనెల 14న బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం
తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు(సోమవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 14న బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆయన రేపు రాజధానికి పయనం కానున్నారు. ఢిల్లీలో డిసెంబర్ 14న ఎస్పీ రోడ్ లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారభించనున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని , జాతీయ కార్యవర్గాన్ని అదే రోజు ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందుగానే మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ లు కార్యాలయం ప్రారంభ పనులను చూసుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి మంత్రులంతా..ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను తీసుకొని రావాలని కేసీఆర్ ఆదేశించారు.
ఈనెల 16 లేదా 17న ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం
మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఈనెల 16 లేదా 17వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేసుకోవడానికి విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతం కోసం సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి వైసీపీ నేతలందరూ సమిష్టిగా పని చేయాలని బొత్స సూచించారు. భవిషత్ కార్యాచరణ రూపొందించడానికి జిల్లాలో అందరూ ఇప్పటి వరకు సమన్వయంతో పనిచేయాలన్నారు. చిన్నపాటి అసంతృప్తి ఉన్నా చర్చించుకుంటూ ముందుకు వెళ్తున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు.
కవిత మహిళ కావడంతోనే ఇంటికి వెళ్లి సీబీఐ విచారణ చేస్తున్నారు
కవిత మహిళ కావడంతోనే ఇంటికి వెళ్లి సీబీఐ విచారణ చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గములో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది. బీజేపీ ముఖ్యమంత్రి ముందుగా అభ్యర్థిని ప్రకటించదన్నారు. కొంత మంది కావాలని బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తా అనే అధికారం నాకు లేదని బండి సంజయ్ తెలిపారు. మహిళ కావడంతోనే ఇంటికి వెళ్లి సిబిఐ వాళ్ళు విచారణ చేస్తున్నారని తెలిపారు. సింహాల ఫొటోలు చూసి ఇంట్లోకి పోవాలా వద్దా అని భయపడుతున్నారని ఎద్దేవ చేశారు బండిసంజయ్. ప్రత్యేక కమిటీ, పార్లమెంట్ పార్టీ బోర్డు మాత్రమే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తాయని చెప్పారు.
అన్‌స్టాపబుల్ షోలో బాహుబలి.. ఈ ప్రశ్న అడగాలంటున్న ఫ్యాన్స్
నందమూరి బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ షోతో తనలో ఉన్న హోస్ట్ ను బయటపెట్టాడు. అబ్బా బాలకృష్ణ హోస్ట్ ఏంటి..? అన్నవారు ముక్కు మీద వేలేసుకునేలా సీజన్ 1 ను విజయవంతం చేశాడు. ఇక ఆయన వాక్చాతుర్యం ముందు స్టార్ హీరోలు సైతం సైలెంట్ అయిపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక సీజన్ 2 లో ఒక అద్భుతం జరగనుంది. ఎప్పుడు ఏ టాక్ షోకు రాని ప్రభాస్ ను ఈ షోకు ఆహ్వానించాడు బాలయ్య. ఎప్పటి నుంచో ఈ వార్తలు వస్తున్న వేళ నేడు ఆహా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. బాలయ్యతో బాహుబలి.. అభిమానులు బాలయ్య.. బాహుబలిని ఏ ప్రశ్న అడగమంటారు.. ఒకటి చెప్పండి అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఏకరువు పెట్టేశారు.
అవతార్-2 రన్‌టైమ్ ఎంతో తెలుసా?
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మరోసారి అద్భుతాన్ని తెరపైకి తెస్తున్నారు. అవతార్‌కు సీక్వెల్‌గా అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే ఇప్పుడు అవతార్-2 రన్‌టైమ్ చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీ రన్‌టైమ్ 3 గంటల 12 నిమిషాల 10 సెకన్‌లు అని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇంత నిడివి గల సినిమా రాలేదు. చివరకు ఆర్.ఆర్.ఆర్ సినిమా కూడా ఇంచుమించు మూడు గంటలు మాత్రమే ఉంది. దీంతో అన్ని థియేటర్లు షో టైమ్‌లన్నీ మార్చేస్తున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సాధారణంగా మార్నింగ్ షో 11 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే అవతార్-2 నిడివి దృష్ట్యా ఉదయం 9:30 గంటలకే మార్నింగ్ షోను ప్రారంభిస్తున్నారు. మ్యాట్నీ షో 1:30 గంటలకు, ఫస్ట్ షో సాయంత్రం 5:30 గంటలకు, సెకండ్ షో రాత్రి 9:30 గంటలకు వేస్తున్నట్లు థియేటర్ యాజమాన్యాలు ప్రకటించాయి.